Allu Arjun: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ను ఆ స్టార్ హీరో ఓపెన్ చేస్తారా?

  • May 31, 2023 / 08:12 PM IST

స్టార్ హీరో అల్లు అర్జున్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప ది రైజ్ సినిమాలో కొన్ని మైనస్ లు ఉన్నా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా ఆ రెమ్యునరేషన్ ను తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అమీర్ పేట్ లో సత్యం థియేటర్ స్థానంలో ఏషియన్ సంస్థ భాగస్వామ్యంతో ఎఎఎ సినిమాస్ పేరుతో బన్నీ భారీ మల్టీప్లెక్స్ ను నిర్మించిన సంగతి తెలిసిందే.

ఎఎఎ అంటే ఏషియన్ అల్లు అర్జున్ (Allu Arjun) అని సమాచారం. ఈ మల్టీప్లెక్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఆదిపురుష్ సినిమాతో ఈ మల్టీప్లెక్స్ ఓపెన్ కానుందని సమాచారం అందుతోంది. ప్రభాస్ చేతుల మీదుగా ఈ మల్టీప్లెక్స్ ఓపెన్ కానుందని ప్రచారం జరుగుతుండగా ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందేనని చెప్పవచ్చు.

ఎన్నో స్పెషాలిటీలతో ఈ మాల్, మల్టీప్లెక్స్ ఉండనుందని సమాచారం. ఈ మల్టీప్లెక్స్ కోసం ఊహించని స్థాయిలో ఖర్చు చేశారని తెలుస్తోంది. త్వరలో ఈ మల్టీప్లెక్స్ కు సంబంధించి అధికారికంగా మరిన్ని విషయాలను వెల్లడించనున్నారు. మరోవైపు పుష్ప2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

పుష్ప2 సినిమా హక్కులకు కూడా భారీ రేంజ్ లో డిమాండ్ నెలకొంది. ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పుష్ప2 సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా బన్నీకి, రష్మికకు భారీ విజయాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus