Jr NTR: హైప్ పెంచేసిన కెమెరామేన్ ట్వీట్.. తారక్ లోని క్రూరత్వాన్ని చూపిస్తామంటూ?

ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కథ, కథనంలో ప్రత్యేకతలు ఉండటంతో పాటు సినిమాను అద్భుతంగా తెరకెక్కించగల సామర్థ్యం దర్శకుడికి ఉంటే మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దేవరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ అభిమానులకు పూనకాలు వచ్చే విధంగా ఉండనుందని తెలుస్తోంది. తాజాగా కెమెరామేన్ రత్నవేలు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. రత్నవేలు తన ట్వీట్ లో వెన్నెలతో ప్రకాశవంతంగా ఉన్న సముద్రంపై క్రూరమైన, నెత్తుటిధారతో కూడిన యాక్షన్ సీన్ ను షూట్ చేశామని ఆయన వెల్లడించారు.

ఈ సీన్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఐదు షెడ్యూల్స్ పూర్తి కాగా ఆరో షెడ్యూల్ అతి త్వరలో మొదలుకానుందని భోగట్టా. డేట్ల సమస్య వల్ల ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్ లేట్ అవుతోందని తెలుస్తోంది. మరోవైపు నవంబర్ చివరి వారం నుంచి వార్2 షూటింగ్ మొదలుకానుండగా తారక్ ఈ సినిమా షూటింగ్ తో బిజీ కావడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాలో తారక్ (Jr NTR) రోల్ భిన్నంగా ఉండనుందని సమాచారం అందుతోంది. తారక్ ఈ సినిమాలతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. తారక్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో యాక్షన్ సీన్లకు పెద్ద పీట వేస్తున్నారని తెలుస్తోంది. తారక్ తోటి హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.

గ్లోబల్ స్టార్ గా ఇప్పటికే గుర్తింపును సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ గుర్తింపు మరింత పెరిగే విధంగా సినిమాలను ఎంచుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాపై కొంతమేర దృష్టి పెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

 

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus