ఎన్బీకే 108పై షాకింగ్ అప్ డేట్.. గూస్ బంప్స్ వచ్చేలా?

  • April 23, 2023 / 04:02 PM IST

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలను మించి ఈ సినిమాలో ఫైట్ సీన్స్ ఉంటాయని ఆ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈరోజు నుంచి రెండు వారాల పాటు ఫైట్ సీన్ ను షూట్ చేయనున్నారని సినిమాకు ఈ ఫైట్ సీన్ హైలెట్ గా నిలవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో కాజల్ నటిస్తుండగా బాలయ్య, కాజల్ కాంబోలో తెరకెక్కుతున్న తొలి మూవీ ఇదేననే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శ్రీలీల నటిస్తున్నారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు సంబంధించి విడుదలవుతున్న పోస్టర్లు ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి.

అనిల్ రావిపూడి ఈ సినిమాకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి స్థాయిని పెంచేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ మూవీతో హ్యాట్రిక్ సాధిస్తానని బాలయ్య ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బాలయ్య వరుసగా ఊరమాస్ మసాలా కథలతో తెరకెక్కిన సినిమాలలో నటిస్తున్నారు. ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో సక్సెస్ సాధించిన బాలయ్య తర్వాత సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus