Salaar: సలార్ సినిమాలో యంగ్ టైగర్.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా?

  • October 3, 2023 / 05:05 PM IST

ఈ ఏడాది డిసెంబర్ నెల 22వ తేదీ ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగ రోజు అనే సంగతి తెలిసిందే. సలార్ సినిమా ఆరోజు థియేటర్లలో విడుదల కానుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే రిలీజ్ సమయం దగ్గర పడే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెంచేలా ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. నవంబర్ నెల చివరి వారంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది.

అయితే సలార్ మూవీ క్లైమాక్స్ లో యశ్, జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారని సమాచారం అందుతోంది. ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్, యశ్, తారక్ కనిపిస్తే ఫ్యాన్స్ కు కలిగే సంతోషం మామూలుగా ఉండదని చెప్పవచ్చు. సర్ప్రైజ్ క్యామియోలలా యశ్, తారక్ కనిపిస్తారని తెలుస్తోంది. శాండిల్ వుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ ప్రచారం జరుగుతుండగా ప్రశాంత్ నీల్ స్పందిస్తే మాత్రమే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.

ప్రభాస్ తో కలిసి ఈ హీరోలు కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా మరి కొందరు మాత్రం రోలింగ్ టైటిల్స్ లో యశ్, ఎన్టీఆర్ తర్వాత సినిమాలకు సంబంధించిన క్యామియోలు ఉంటాయని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సలార్ మూవీ ఉగ్రం రీమేక్ అని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదని నెటిజన్ల నుంచి, ప్రభాస్ అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ క్లైమాక్స్ లో సలార్2 సినిమాకు సంబంధించి కూడా అప్ డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. సలార్ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా సలార్ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus