వైరల్ : హీరోయిన్ శ్రియ టైం బాగుంది.. ..!

తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను దక్కించుకుని చాలా కాలం ఆ ప్లేస్ ను కాపాడుకుంటూ వచ్చింది శ్రియ శరణ్. ఈమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదిహేనేళ్లు పూర్తయినప్పటికీ ఈమె గ్లామర్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి.బాలీవుడ్ లో కూడా ఈమె పలు సినిమాల్లో నటించింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అమ్మడు తన భర్త ఆండ్రీ కొస్చీవ్‌తో కలిసి హాలీడే ట్రిప్ వేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను,వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలను కనుక గమనిస్తే వీరి రొమాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అనిపించక మానదు. కుజ్కోలోని ప్రఖ్యాతి గాంచిన మచ్చుపిచ్చు ప్రాంతాన్ని సందర్శించడానికి వీరు వెళ్లారు. 2007వ సంవత్సరంలో ప్రపంచంలోని ఏడు వింతల్లో ఓ కొత్త వింతగా ఈ ప్లేస్ ఎంపికయ్యింది.ఇదిలా ఉండగా.. శ్రీయ పోస్ట్ చేసిన ఫొటోలతో పాటు ఓ వీడియో కూడా వైరల్ అవుతుండడం విశేషం. ఈ వీడియోలో శ్రీయ ఓ ఫోటోకి ఫోజు ఇస్తూ ఉండగా.. సడెన్ గా ఓ ఒంటె ఆమె మీదికి దూసుకువచ్చింది.

శ్రీయ వెంటనే అప్రమత్తం అయ్యి అక్కడినుండీ తప్పుకోవడంతో ఆమెకి ప్రమాదం తప్పింది. లేదంటే కచ్చితంగా ఈమెకు గాయాలు అయ్యేవి అనడంలో సందేహం లేదు. ఈ వీడియోకి ‘టేక్‌ మీ బ్యాక్‌’ అనే క్యాప్షన్ పెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది శ్రీయ. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తుండడం విశేషం.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus