చాలా ఏళ్ల నుండి వెయిట్ చేస్తున్న ‘బంగార్రాజు’ సినిమా ముహూర్తం దగ్గరపడింది. ఈ నెల 20 సినిమాను ప్రారంభిస్తారని మనం నిన్ననే చదువుకున్నాం. అయితే ఈ రోజు మరో వార్త బయటికొచ్చింది. సినిమాలో కీలక పాత్రలో నటించాల్సిన రమ్యకృష్ణ తప్పుకున్నారని సమాచారం. ఆమె ప్లేస్‌లోకి అక్కినేని ఆస్థాన నాయకి శ్రియ వచ్చి చేరిందని సమాచారం. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు ఈ సినిమా ప్రీక్వెల్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే.
గత కొన్ని ఏళ్ల నుండి దర్శకుడ కళ్యాణ్‌కృష్ణ ఈ కథ మీదే కుస్తీ పడుతున్నాడు. ఎట్టేకేలకు ఇటీవల ఓకే చేసుకొని… ప్రీప్రొడక్షన్ పనులు పూర్త చేశాడు. అయితే సినిమాలో రమ్యకృష్ణ పాత్ర విషయంలో మాత్రం మార్పులు అవసరమని భావించారట. ఆమెకు బదులు శ్రియ అయితే బాగుంటుందని సూచనలు వచ్చాయట. దీంతో మార్పు జరిగిపోయిందని అంటున్నారు. రమ్యకృష్ణకు, నాగార్జునకు మంచి అనుబంధమే ఉంది. కాబట్టి ఆ దిశగా ఆమె సినిమాల నుండి తప్పుకున్నారు అనుకోలేం.
ఇక పాత్ర నిడివి లాంటి సమస్యలు అస్సలు ఉండవు. అయితే ఇటీవల కాలంలో రమ్యకృష్ణ సినిమాలపట్ల ఆసక్తి చూపించడం లేదని, అందుకే ఈ సినిమా నుండి తప్పుకున్నారని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!