రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా ప్రభాస్ రేంజ్ లో హై బడ్జెట్ సినిమాలు చేయడం లేదు. ఇక ఈ స్టార్ తో సినిమా చేసిన ఎవరైనా సరే ఈజీగా ఫిదా అవుతారు. సలార్ షూటింగ్ ద్వారా మొదటిసారి ప్రభాస్ తో కలిసి వర్క్ చేసిన శ్రుతి హసన్ అతడి మనస్తత్వం గురించి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.
శ్రుతి హసన్ మాట్లాడుతూ.. నా జీవితంలో ఎంతో మంది ఫేక్ మనుషులను చూశాను. ముఖ్యంగా స్టార్ రేంజ్ ఉన్నప్పటికీ వినయంతో ఉన్నట్లు నటించేవారిని కూడా చూశాను. అయితే ప్రభాస్ మాత్రం అలాంటి వ్యక్తి కాదు. అతన్ని ఒక్కసారి చూస్తే చాలు ఆ విషయం సులభంగా అర్ధమవుతుంది. ఎంతో పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ ఒదిగి ఉంటాడు. ఎప్పుడు కూడా కూల్ గా ఉంటూ పక్కా వారిలో కూడా జోష్ నింపుతాడు.
ప్రభాస్ ఉంటే అక్కడ వాతావరణం కుడా ఎంతో ఎనర్జీగా ఉంటుంది. నా జీవితంలో ఇలాంటి స్టార్ ను చూడలేదు.. అంటూ ప్రభాస్ ను పదే పదే పొగిడేసింది. ఇక సలార్ సినిమాలో శ్రుతి పొలిటికల్ జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది. సినిమా కథలో ఆమెది చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదట హీరోయిన్ సెలక్షన్ విషయంలో కొంతమంది బాలీవుడ్ స్టార్స్ ను అనుకున్నప్పటికి చివరికి శృతి హాసన్ ను ఫిక్స్ చేశాడు.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!