టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఈ మధ్య కాలంలో సినిమా కథ, పాత్ర కంటే రెమ్యునరేషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లలో స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్లు ఊహించని స్థాయిలో పెరగడం గమనార్హం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ చిరంజీవి బాబీ కాంబో సినిమాతో పాటు బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుండటం గమనార్హం. అయితే బాలయ్య సినిమాకు కోటిన్నర రూపాయల పారితోషికం తీసుకోవడానికి ఒప్పుకున్న శృతి హాసన్ చిరంజీవి సినిమాకు మాత్రం 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని సమాచారం అందుతోంది.
మేకర్స్ సైతం శృతి హాసన్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఓకే చెప్పారని బోగట్టా. సీనియర్ హీరోల సినిమాలలో వరుసగా ఆఫర్లు దక్కుతున్న నేపథ్యంలో శృతి హాసన్ తన రెమ్యునరేషన్ ను పెంచేశారు. ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ జర్నలిస్ట్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడు కావడంతో పాటు ఆయన డైరెక్షన్ లో శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన బలుపు, క్రాక్ సక్సెస్ సాధించడంతో శృతి హాసన్ రెమ్యునరేషన్ విషయంలో పట్టింపులకు పోలేదని సమాచారం.
రీఎంట్రీలో వరుసగా సినిమా ఆఫర్లతో బిజీ కావాలని శృతి హాసన్ భావిస్తున్నారు. శృతి హాసన్ నటనకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఫ్లాపుల్లో ఉన్న హీరోలు శృతి హాసన్ తో కలిసి నటిస్తే సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది. సీనియర్ హీరోయిన్లలో ఆఫర్ల విషయంలో శృతి హాసన్ నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నారని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!