వైరలవుతున్న శ్రుతిహాసన్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

అప్పుడెప్పుడో వచ్చిన “కాటమరాయుడు” చిత్రంలో ఆఖరిసారిగా మెరిసిన శ్రుతిహాసన్ ఆ తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో తప్ప ఇంకెక్కడా కనిపించలేదు. అమ్మడు ఎవరో ఫారిన్ బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో ఉందని, సహజీవనం కూడా చేస్తుందని మొదట గుసగుసలు వినిపించాయి. శ్రుతి తర్వాత ఆ వార్తలను ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసిందనుకోండి. మరి ప్రియుడి కోసమో లేక సినిమాలు బోర్ కొట్టేశాయో తెలియదు కానీ.. సడన్ గా సినిమాల నుంచి తప్పుకొని తన డ్రీమ్ అయిన పాప్ సింగింగ్ ను ఎచీవ్ చేయడం కోసం ప్రయత్నాలు మొదలెట్టింది.

ఏమైందో ఏమో తెలియదు కానీ.. సడన్ గా బ్రేకప్, సింగింగ్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించింది. అప్పటికి శ్రుతికి ఉన్న క్రేజ్ & పాపులారిటీకి అమ్మడికి ఆఫర్లు రావడం అనేది పెద్ద సమస్యేమీ కాదు. ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకొని తన కమ్ బ్యాక్ ను గట్టిగానే ప్లాన్ చేసుకొంది. అయితే.. కరోనా & లాక్ డౌన్ వల్ల ఆ ప్లాన్స్ అన్నీ అటకెక్కాయనుకోండి.

మొన్నటివరకూ ముంబైలో ఉండిపోయిన శ్రుతి అక్కడ కరోనా కేసులు పెరుగుతుండడంతో హైద్రాబాద్ షిఫ్ట్ అయ్యింది. ఇక్కడికి వచ్చిన అమ్మడు ఈమధ్య ఒక మ్యాగజైన్ కోసం సెల్ఫ్ ఫోటోషూట్ చేసుకొంది. తన నెస్ ను కాస్త గట్టిగానే చూపించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి శ్రుతి కొత్త అందాలను చూసి ఆమెకు ఏమైనా కొత్త ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus