కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శృతి హాసన్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె వృత్తిపరమైన జీవితంలోను అలాగే వ్యక్తిగత జీవితంలోను ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఈమె డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికతో ప్రేమలో ఉన్నారు. ఈమె నిత్యం తన ప్రియుడితో కలిసి ఉన్నటువంటి వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు.
ఇక ఈమె తండ్రి కమల్ హాసన్ రాజకీయాలలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె కూడా రాజకీయాలలోకి రాబోతోందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల పై శృతి హాసన్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా శృతిహాసన్ కోయంబత్తూర్ లోనే ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈమెకు రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ ప్రస్తుతం తనకు రాజకీయాలు అన్న రాజకీయాలలోకి రావాలి అన్న ఏమాత్రం ఆసక్తి లేదని కుండలు బద్దలు కొట్టి చెప్పేశారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపై మాత్రమే ఉంది రాజకీయాలపై ఏమాత్రం ఆశక్తి లేదు. సినిమాల పరంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా మంచి కథలు వస్తే సినిమాలలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
నాకు తెలుగు ఇతర భాషలలో సినిమా అవకాశాలు వచ్చిన తప్పకుండా చేస్తాను అయితే తాను తమిళ అమ్మాయి కావడం వల్లే తమిళ సినిమాలు చేస్తానని కూడా తెలియజేశారు. ప్రస్తుతం ఈమె ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకులకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హాయ్ నాన్న సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కూడా శృతిహాసన్ (Shruti Haasan) కీలకపాత్రలో నటించారని తెలుస్తోంది.
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!