ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కొందరు ఆ కలలను నిజం చేసుకుంటే మరి కొందరి జీవితంలో కలలు కలలుగానే మిగిలిపోతాయి. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కు సొంతంగా మ్యూజికల్ బాండ్ స్టార్ట్ చేయాలనే కల ఉందనే సంగతి తెలిసిందే. అయితే శృతి హాసన్ కు మరో కోరిక కూడా ఉంది. ముంబాయి నగరంలో తనకు నచ్చిన వంటకాలతో సౌతిండియా రెస్టారెంట్ ను స్టార్ట్ చేయాలని శృతి హాసన్ భావిస్తున్నారు.
ఆ రెస్టారెంట్ లో ఆంధ్రా పప్పు, తమిళ సాంబార్ ఉంటే చాలని వాటిని తింటూ లైఫ్ లాంగ్ బ్రతికేస్తానని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. వంట చేయడం తనకు చాలా ఇష్టమని చేసిన వంటను నలుగురికి తినిపించడం ఇంకా ఇష్టమని శృతి హాసన్ వెల్లడించారు. మరి శృతి హాసన్ రాబోయే రోజుల్లో తన కోరికను నెరవేర్చుకుంటారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు ఈ మధ్య కాలంలో భోజనం అంటే ప్రభాస్ గుర్తుకు వస్తున్నాడని శృతి పేర్కొన్నారు.
సలార్ షూటింగ్ సమయంలో ప్రభాస్ 40 వెరైటీలతో భోజనం పంపించారని కొంచెం కొంచెం అన్నీ టేస్ట్ చేసినా అవన్నీ తినలేకపోయానని శృతి వెల్లడించారు. ఆ తర్వాత డెజర్ట్ పంపిస్తానని చెప్పి ప్రభాస్ మూడు సంచుల నిండుగా డెజర్ట్ పంపించారని శృతి కామెంట్లు చేశారు. ప్రభాస్ కు నలుగురికి భోజనం పెట్టడం ఇష్టమని అది అతని వారసత్వమని శృతి అన్నారు. ప్రభాస్, శృతి కలిసి నటిస్తున్న సలార్ కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!