ఆ హీరోయిన్ కు శృతిహాసన్ పాట!

శృతిహాసన్ హీరోయిన్ అవ్వకముందే మంచి గాయని. కొన్ని చిత్రాల్లో పాటలు పాడి శ్రోతలను అలరించింది. ఆల్బమ్స్ చేస్తూనే.. సినిమాల్లో కూడా పాడింది. అలాంటి శృతి హాసన్ మొదటి సారిగా ఓ హీరోయిన్ కోసం పాట పాడబోతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? మిల్కీ బ్యూటీ తమన్నా.

ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న తమన్నా తమిళంలో విశాల్ సరసన ‘కత్తి సండై’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నాకు సోలో సాంగ్ ఉంది. ఈ సాంగ్ కు మరింత ప్రత్యేకతను చేకూర్చడానికి చిత్రబృందం శృతి హాసన్ తో పాడించాలని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. మరి తెలుగు వెర్షన్ లో కూడా శృతి పాడుతుందేమో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus