వైరల్ అవుతున్న శ్వేతా బసు కామెంట్స్..!

కొత్తబంగారులోకం సినిమాలో ముద్దు ముద్దుగా మాట్లాడి అందరి హృదయాలు కొల్లగొట్టిన ఈ భామ చాలాసార్లు మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. పలు వివాదాల్లో మునిగి తేలింది. అంతేకాదు, పర్సనల్ లైఫ్ కూడా బాగా డిస్టర్బ్ అయ్యి, డిప్రెషన్ లోకి కూడా వెళ్లానని తానే స్వయంగా ట్వీట్ కూడా చేస్కుంది. అయితే, ఇప్పుడు రీసంట్ గా తన భర్తతో తీసుకున్న విడాకులపై అభిమానులని క్లారిటీ ఇచ్చింది ఈ చిన్నది. 2018లో బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ మిట్టల్ ని ప్రేమించి పెళ్లి చేస్కున్న సంగతి తెలిసిందే.

అయితే, కొన్ని నెలలకే వీళ్లిద్దరూ విడాకులు తీస్కున్నారు. రీసంట్ గా దీనిపై స్పందించింది శ్వేతా బసు. అసలు ఈ రిలేషన్ షిప్ విడాకులు కాదని, అది బ్రేకప్ లాంటిదని చెప్పుకొచ్చింది. నిజానికి చాలామంది పెళ్లైన చాలా సంవత్సరాలకి కూడా విడాకులు తీస్కుంటుంటారని అది చాలా కామన్ గా జరుగుతోందని, దాన్ని విడాకులు అంటే అనొచ్చు కానీ, సంవత్సరం లోపే మేమిద్దరం విడిపోయామని ఇది ఒక బ్రేకప్ లాంటిదని చెప్తోంది. అంతేకాదు,

విడాకులు లాంటి పెద్ద పదంతో దీన్ని పోల్చద్దని ఆ సమయంలో నాకు నా కుటుబం నుంచి మంచి సహకారం లభించిందని భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది. నాకు నేనే మంచి ఫ్రెండ్ అయ్యాను. ఇప్పుడు అంతా కూల్ గానే ఉంది. నా కుటుంబం, స్నేహితలు మేలు మరిచిపోలేనిది అంటూ పోస్ట్ చేసింది. ఇప్పుడు శ్వేత పెట్టిన ఈ పోస్ట్ కి నెటిజన్స్ లైక్ కొడుతూ, కామెంట్స్ పెడుతున్నారు. తన ఫ్యూచర్ కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. అదీ మేటర్.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus