Shyamala Devi,Prabhas: ప్రభాస్ తనకు పుట్టకపోయినా తన బాబే.. శ్యామలాదేవి కామెంట్స్ వైరల్!

  • January 20, 2024 / 03:20 PM IST

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వేణుస్వామి ప్రభాస్ జాతకం గురించి వేణుస్వామి వేర్వేరు సందర్భాల్లో కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సందర్భంలో వేణుస్వామిపై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ప్రభాస్ ఆరోగ్యం గురించి కూడా వేణుస్వామి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ప్రభాస్ జాతకం గురించి వేణుస్వామి చేస్తున్న కామెంట్ల గురించి శ్యామలాదేవి స్పందించారు.

ప్రభాస్ జాతకం గురించి వేణుస్వామి చేస్తున్న కామెంట్లు వింటే బాధేస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. వేణుస్వామి క్రేజ్ తెచ్చుకోవడం కోసం ప్రభాస్ గురించి నెగిటివ్ గా చెబుతున్నాడని శ్యామలాదేవి వెల్లడించారు. వేణుస్వామి ప్రభాస్ జాతకం గురించి వెల్లడిస్తున్న విషయాలు బాధను కలిగించడంతో పాటు ఇబ్బంది పెడుతున్నాయని ఆమె అన్నారు. ప్రభాస్ జాతకం ప్రభాస్ తల్లికి మాత్రమే తెలుసని వేణుస్వామికి ప్రభాస్ జాతకం ఎలా తెలుస్తుందని శ్యామలాదేవి (Shyamala Devi) ప్రశ్నించారు.

బయటివాళ్లకు ప్రభాస్ జాతకం ఏ విధంగా తెలుస్తుందో నాకు అర్థం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభాస్ తనకు పుట్టకపోయినా తన బాబేనని ఆమె కామెంట్లు చేశారు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కామెంట్లు చేస్తే బాగుంటుందని శ్యామలాదేవి అన్నారు. ప్రభాస్ రేంజ్, రెమ్యునరేషన్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండగా ప్రభాస్ ఈ ఏడాది మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

సలార్2 షూటింగ్ త్వరలో మొదలుకానుందని తెలుస్తోంది. రాజాసాబ్ టీజర్ ఫిబ్రవరిలో వస్తుందా అని మారుతిని ఫ్యాన్స్ అడగగా టీజర్ రిలీజ్ కు సమయం ఉందని మారుతి చెబుతున్నారు. ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే మే నెల 9వ తేదీన రిలీజ్ కానుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. ప్రాజెక్ట్ కే నైజాం రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus