హీరో సిద్ధార్థ్ (Siddharth) , హీరోయిన్ అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari) సెప్టెంబర్ నెలలో సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది స్నేహితులు, బంధు మిత్రుల సమక్షంలో సిద్ధార్థ్, అదితి ..ల వివాహం జరిగింది. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో వీరి వివాహం జరిగినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగా.. తాజాగా మరికొన్ని ఫోటోలను అదితి రావు హైదరి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ‘మా పెళ్లి వేడుకకు సంబంధించిన స్పెషల్ మెమోరీస్, మా తల్లిదండ్రులతో పాటు మా గురువులు, సన్నిహితుల ఆశీస్సులు కూడా అందుకున్నాము. మని సార్ & హాసిని మేమ్, లీల అక్క, కమల్ సార్, రజనీ ఆంటీ, మనియన్ అంకుల్, సుధా అండ్ జయేంద్ర.. ఇలా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చింది అదితి.
ఇక ఆమె షేర్ చేసిన ఫొటోల్లో మణిరత్నం, సుహాసిని, కమల్ హాసన్ వంటి వారు ఉన్న ఫోటోలు హైలెట్ అయ్యాయి. ఇక అదితి, సిద్దార్థ్..లు మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాలో లవర్స్ గా నటించిన వీళ్ళు నిజజీవితంలో కూడా కపుల్ అవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. కాగా వీరిద్దరికీ ఇది వరకే పెళ్లిళ్లు అయ్యాయి. సిద్ధార్థ్ కి మొదట వేరే అమ్మాయితో పెళ్లి అయ్యింది. అయితే తర్వాత విడిపోయారు. అదితికి కూడా మొదట వేరే అబ్బాయితో పెళ్లి అయ్యింది. ఆమె కూడా విడాకులు తీసుకోవడం జరిగింది.