Simbu: గౌతమ్‌ మేనన్‌ – శింబు కొత్త పోస్టర్‌ చూశారా!

  • August 7, 2021 / 01:43 PM IST

కోలీవుడ్‌ ఖలేజా ఉన్నా… సరైన విజయం దక్కని హీరోల్లో శింబు ఒకడు. ఒకప్పుడ మోస్ట్‌ హ్యాపెనింగ్‌ హీరోగా పేరుగాంచిన శింబు… ఆ తర్వాత నెమ్మదించాడు. దానికి కారణాలు చాలా ఉన్నా… స్ట్రాంగ్‌ కమ్‌ బ్యాక్‌ మాత్రం చాలా అవసరం అనిపించే స్థితిలోకి వచ్చాడు. ఈ సమయంలో ఈ రోజు రిలీజ్‌ అయిన ఓ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. శింబు పాత రోజుల్ని గుర్తు తెస్తోంది. అదే ‘వెందు తనిందదు కాడు’. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ అదిరిపోయిందని చెప్పొచ్చు.

శింబు నుండి గతేడాది ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ప్రస్తుతం అతని చేతిలో వరుస సినిమాలున్నాయి. వాటిలో వేటికదే భిన్నం అని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చిన ‘వెందు తనిందదు కాడు’ కూడా అంతే భిన్నంగా కనిపిస్తోందని చెప్పొచ్చు. ‘వెందు తనిందదు కాడు’ అంటే ‘కాలి బూడిదైన అడవి’ అని అర్థం. అయితే ఈ సినిమాకు గతంలో ‘నాదిగైళే నీరడుమ్‌ సూర్యన్‌’ అనే పేరు పెట్టారు. అయితే ఇప్పుడు మార్చేశారు.

ఆ పేరు, శింబు గెటప్‌ చూస్తుంటే కచ్చితంగా హిట్‌ కొట్టేలా కనిపిస్తున్నాడు. గౌతమ్‌ మేనన్‌కు కూడా సరైన హిట్ రావాల్సిన సమయం ఇది. కాబట్టి ఇద్దరూ స్ట్రాంగ్‌ కమ్‌బ్యాక్‌ ఇస్తారేమో చూడాలి. ఇక శింబు మిగిలిన సినిమాలు చూస్తే ‘మానాడు’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఇది కాకుండా ‘పత్తు తళ’ అని మరో సినిమా ఇటీవల అనౌన్స్‌ చేశారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus