Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. ఫోటోలు వైరల్!

  • June 5, 2023 / 01:06 PM IST

రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడో సెన్సేషన్. ఈ యంగ్ ఫెలో గల్లీ సింగర్ రేంజ్ నుండి ఆస్కార్ రేంజ్ కి ఎదిగాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో రాహుల్ పాడిన నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ దక్కింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. మరో అరుదైన విషయం ఏమిటంటే… రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేదికపై పాడారు. అది కొద్దిమందికి మాత్రమే దక్కే అవకాశం. ఈ పరిణామం రాహుల్ సిప్లిగంజ్ మరింత పాప్యులర్ చేసింది.

రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) కెరీర్లో ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇక రాహుల్ సిప్లిగంజ్ ఇమేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో చెప్పేందుకు ఓ వేడుక కారణమైంది. రాహుల్ సిప్లిగంజ్ తమ్ముడు నిఖిల్ సిప్లిగంజ్ వివాహం చేసుకుంటున్నాడు. ఈ పెళ్లి వేడుకకు తెలంగాణ అధికార, విపక్షాల నాయకులు హాజరయ్యారు. బిఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ తో పాటు మరికొందరు హాజరయ్యారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

రాహుల్ సిప్లిగంజ్ పిలిచిన వెంటనే ఈ స్థాయి నాయకులు పెళ్లికి హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిఖిల్ సిప్లిగంజ్ మ్యారేజ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. ఇంకా నిఖిల్ చేసుకోబోయే అమ్మాయి పేరు నిధి అని తెలుస్తుంది. మరి వీరిది అరేంజ్డ్ మ్యారేజా లేక లవ్ మ్యారేజా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు రాహుల్ సిప్లిగంజ్ పలుమార్లు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నారు. బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ సిప్లిగంజ్ హీరోయిన్ పునర్నవి భూపాళంతో ఎఫైర్ నడిపారు.

అప్పట్లో వీరి రిలేషన్ హాట్ టాపిక్ అయ్యింది. అలాగే మరో బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డితో రాహుల్ చాలా సన్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు పలుమార్లు వైరల్ అయ్యాయి. రాహుల్-అషురెడ్డి మధ్య రిలేషన్ ఏంటనేది సస్పెన్సు. రాహుల్ వివాహం చేసుకోకుండా తమ్ముడికి చేస్తున్నాడు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. రాహుల్ తమ్ముడు నిఖిల్ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus