Singer Smita: బిగ్ బాస్ కార్యక్రమం పై షాకింగ్ కామెంట్స్ చేసిన సింగర్స్ స్మిత!

బుల్లితెర పై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో లలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి.ఇప్పటికే అన్ని భాషలలో ఎన్నో సీజన్లను పూర్తిచేసుకుని విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక ఈ రియాలిటీ షోలో పాల్గొనడం కోసం ఎంతో మంది సెలబ్రిటీలు ఆసక్తి కనపరచగా మరికొంతమంది మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏమాత్రం ఆసక్తి చూపించరు.ఇకపోతే తాజాగా తెలుగులో కూడా ఈ కార్యక్రమం నేడు ఎంతో ఘనంగా ఆరవ సీజన్ ప్రారంభం కాబోతుంది.

ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఇక నేడు ఎంతో ఘనంగా సీజన్ సిక్స్ ప్రారంభం కాబోతోంది.ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొనే ఎంతోమంది కంటెస్టెంట్ ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీరిలో సింగర్ స్మిత పేరు కూడా వినిపించింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం గురించి సింగర్స్ స్మిత స్పందిస్తూ చచ్చినా నేను బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్ళను అంటూ బిగ్ బాస్ కార్యక్రమం పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

నేను వెళ్లడమే కాకుండా నాకు బాగా సన్నిహితులైన పరిచయం ఉన్నవారు ఈ కార్యక్రమానికి వెళ్తానని చెప్పినా వద్దనే సలహా ఇస్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఈమె మాట్లాడుతూ నాకు ఈ కార్యక్రమం ఏమాత్రం నచ్చదు అందరిని లోపలకు పంపించి లాక్ చేసి కొట్టుకోమని ఆదేశించడం ఏంటో నాకు అర్థం కాదు.

అయితే ఈ కార్యక్రమంలోకి వెళ్లిన వారిని నేను విమర్శిస్తున్నానని కాదు కానీ ఈ కార్యక్రమంలోకి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus