Singer Smitha: ‘‘ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీలో బ్రిటీష్ వారు కూడా ఉన్నారు’’.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన సింగర్ స్మిత..

  • February 13, 2023 / 06:15 PM IST

సింగర్ స్మిత గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.. ప్లేబ్యాక్ సింగర్, పాప్ సింగర్, యాక్ట్రెస్, హోస్ట్ అండ్ బిజినెస్ వుమెన్‌గా డిఫరెంట్ ప్రొఫెషన్స్‌లో రాణించి తనను తాను ప్రూవ్ చేసుకున్నారామె. అలాగే తమ స్వశక్తితో ఎదగాలనుకునే ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. విజయవాడకు చెందిన స్మిత 1997లో ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం ‘పాడుతా తీయగా’ తో సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆమె రూపొందించిన ‘హాయ్ రబ్బా’ ఆల్బమ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

తెలుగులో, ఆ జనరేషన్‌లో ఫస్ట్ పాప్ సింగర్ స్మితనే కావడం విశేషం.. వెంకటేష్ ‘మల్లీశ్వరి’ మూవీతో నటిగా పరిచయమయ్యారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడలోనూ టాలెంట్ చూపించి ఆకట్టుకున్నారు. ఛార్మీ ‘అనుకోకుండా ఒకరోజు’ చిత్రంలో పాడిన ‘ఎవరైనా చూస్తుంటారా’ అనే బ్యూటిఫుల్ సాంగ్‌కి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిలింఫేర్ అందుకున్నారామె..కొంత గ్యాప్ తర్వాత ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 10 నుండి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోలో పాపులర్ సినీ, పొలిటికల్ అండ్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్‌ని ఇంటర్వూ చేయబోతున్నారు స్మిత..

ఈ సందర్బంగా పలు మీడియా, యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వూలిచ్చారామె. తన పర్సనల్, ప్రొఫెషన్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే స్మిత ప్రేమ వివాహానికీ, అక్కినేని కుటుంబానికీ సంబంధం ఉందని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. అలాగే ఫ్రీడమ్ ఫైటర్‌ ఉన్న తమ కుటుంబంలో బ్రిటిష్ కంట్రీతో పాటు వివిధ దేశాలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పారు..

ఈ వీడియోను స్మిత తల్లి జోగులాంబ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.. స్మిత మాట్లాడుతూ.. ‘‘మా ఇంట్లో అల్లుళ్లు – కోడళ్లు.. ఒక గుజరాతీ, ఒక శ్రీలంకన్, ఒక మెక్సికన్, ఒక పోలిష్, ఒక చైనీస్, ఇద్దరు అమెరికన్స్, రీసెంట్‌గా ఇద్దరు బ్రిటిష్’’ అంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.. అలాగే తన తల్లి పెళ్లప్పటి విశేషాలతో పాటు వాళ్ల ఫ్యామిలీ పెళ్లిళ్ల విషయంలో ఎలాంటి ఫ్రీడమ్ ఇచ్చేవారో, కులం అనే కాలమ్ గురించి కూడా వెల్లడించారు స్మిత..


అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus