బుల్లితెరపై తన యాంకరింగ్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. మేల్ యాంకర్స్ లో ప్రదీప్ ని ఢీ కొట్టేవారే లేరు. తన కామెడీ టైమింగ్, పంచ్ లతో నవ్వులు పూయిస్తాడు. కొంతకాలంగా ప్రదీప్ కి సంబంధించిన ప్రేమ, పెళ్లి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రాజకీయనాయకుడు కూతురుని ప్రదీప్ పెళ్లాడబోతున్నట్లు ప్రచారం జరిగింది. అలానే హీరోయిన్ పూర్ణతో ప్రదీప్ లవ్ ట్రాక్ నడుపుతున్నాడని అన్నారు. ఇవన్నీ టీవీ షోల వరకే పరిమితమైనా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ సింగర్ తో ప్రదీప్ కి లింక్ పెడుతూ వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ప్రదీప్ సరిగమప అనే షోకి యాంకరింగ్ చేస్తున్నారు. ఈ షోలో మెంటార్ గా ఉన్న హారిక నారాయణ్ కు, ప్రదీప్ కి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ షోకి గెస్ట్ గా వచ్చిన ప్రముఖ సింగర్ సునీత కూడా ప్రదీప్ లవ్ ఎఫైర్ పై కౌంటర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది. స్క్రిప్ట్ లో భాగంగా సునీత మాట్లాడారో లేక నిజంగానే ప్రదీప్ కి కౌంటర్ ఇచ్చారో కానీ ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్టేజ్ మీదకి వచ్చిన సునీత.. ప్రదీప్ ని ఉద్దేశిస్తూ ‘ఇక్కడేదో ట్రాక్ నడుస్తుందనైతే విన్నాను’ అంటూ కామెంట్ చేయగానే.. వెంటనే ప్రదీప్ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలో మరోసారి సునీత.. ‘అక్కడ నుండి వచ్చే నవ్వుల పువ్వుల్లో మీరు తడిసిముద్దయి పోవడం చూస్తూనే ఉన్నాం’ అంటూ మరోసారి ప్రదీప్ పై కౌంటర్ వేసింది. ప్రదీప్ పై సునీత ఈ కామెంట్లు చేస్తున్న సమయంలో హారిక సిగ్గుపడుతూ కనిపించింది.
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!