Singer Sunitha: ఫోన్ లో సునీత భర్త రామ్ కి బెదిరింపులు పోలీసులకు ఫిర్యాదు!

  • April 24, 2023 / 02:04 PM IST

ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సునీత గత రెండు సంవత్సరాల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనినీ పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా రెండవ వివాహం తర్వాత సునీత తన వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే సునీత భర్త రామ్ తాజాగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో చేసినటువంటి ఫిర్యాదు ప్రస్తుతం సంచలనగా మారింది. తాజాగా ఈయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో లక్ష్మణ్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నం2లోని సాగర్‌ సొసైటీలో నివాసం ఉంటున్న ఈయనకు గత కొద్ది నెలలుగా కేకే లక్ష్మణ్‌ అనే వ్యక్తి.. తరచూ ఫోన్ చేస్తూ తాను నిర్మాత మండలి సభ్యుడిననీ తనని అర్జెంటుగా కలిసి మాట్లాడాలని వెల్లడించినట్లు తెలిపారు .అయితే లక్ష్మణ్ అనే వ్యక్తి తనకు తెలియదని రామ్ వీరపనేని చెప్పారు. ఒకవేళ తనతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే తన ఆఫీసు సిబ్బందికి తెలియచేయమని ఈయన చెప్పినప్పటికీ లక్ష్మణ్ అనే వ్యక్తి వినకుండా తరచూ ఫోన్ కాల్స్ ద్వారా తనని వేధిస్తున్నారట.

ఈ క్రమంలోనే రామ్ తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేసినప్పటికీ వేరే ఫోన్ నెంబర్స్ ద్వారా కాల్ చేస్తూ తనని వెంటనే కలవకపోతే నీ అంత చూస్తామని బెదిరించినట్లు ఈయన పేర్కొన్నారు. ఇలా తరుచూ తనకు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు ఎక్కువయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విధంగా కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలంటూ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు లక్ష్మణ్‌ మీద ఐపీసీ 506 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈయన మ్యాంగో మీడియా అధినేతగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus