రీసెంట్ సమయం లో భారీ అంచనాల నడుమ విడుదలై ఓపెనింగ్స్ దగ్గర నుండి లాంగ్ రన్ వరకు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తున్న చిత్రం ‘జవాన్’. పఠాన్ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ ఆడియన్స్ కి ఇలాంటి పూర్తి స్థాయి మాస్ మసాలా సినిమాలు చూసి చాలా కాలం అవ్వడం తో ‘జవాన్’ చిత్రాన్ని ఒక ఉద్యమం లాగ చూస్తున్నారు.
కేవలం నాలుగు రోజుల్లో 520 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమాకి, మొదటి వర్కింగ్ డే లో 30 కోట్లకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఒక పఠాన్ చిత్రానికి తప్ప ఈ స్థాయి వసూళ్లు ఏ బాలీవుడ్ సినిమాకి కూడా రాలేదు అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో సౌత్ ఇండియన్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్న సంగతి తెలిసిందే.
వారిలో ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ సిరి (Siri Hanumanth) గురించి మాట్లాడుకోవాలి. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే ఈ అమ్మాయికి, బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ షో ద్వారా మంచి పాపులారిటీ రావడం తో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఇప్పుడు ఏకంగా షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇది సిరి కెరీర్ కి ఎంత ప్లస్ అనే చెప్పాలి.
షారుఖ్ ఖాన్ ని దగ్గర నుండే చూసే అదృష్టం కలిగితే చాలు అనుకునే సిరి కి ఏకంగా జవాన్ చిత్రం లో నటించే ఛాన్స్ దక్కడం మామూలు విషయం కాదు. అయితే ఈ సినిమాలో ఆమె నటించినందుకు గాను షారుఖ్ ఖాన్ ఆమెకి 20 లక్షల రూపాయిల చెక్ ని ఇచ్చాడట. ఆమె పోషించిన ఆ చిన్న పాత్రకి ఇంత మొత్తం డబ్బులు రావడం గొప్పే అని అంటున్నారు నెటిజెన్స్.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!