Sita Ramam Collections: హిందీలో కూడా కుమ్ముతుంది..!

  • September 3, 2022 / 03:36 PM IST

దుల్కర్ సల్మాన్,మృణాల్ రాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సీతా రామం’.హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.స్టార్ హీరోయిన్ రష్మిక మందన,దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్,భూమిక వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇక ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో… మంచి కలెక్షన్లు నమోదు చేసింది.

కానీ ఆశించిన స్థాయిలో కాదు.మొదటి రోజు కలెక్షన్లు బట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే అనుమానం కూడా చాలా మందిలో కలిగింది. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ మూవీ రెండో రోజు నుండి సూపర్ గా పుంజుకుంది. 4 వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ మూవీ 29వ రోజున కూడా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 29 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 9.62 cr
సీడెడ్ 1.88 cr
ఉత్తరాంధ్ర 3.50 cr
ఈస్ట్ 1.94 cr
వెస్ట్ 1.25 cr
గుంటూరు 1.64 cr
కృష్ణా 1.74 cr
నెల్లూరు 0.87 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 22.44 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.79 cr
ఓవర్సీస్ 7.03 cr
మిగిలిన వెర్షన్లు 7.98 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 40.50 cr

‘సీతా రామం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.16.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.17 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారమే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ చిత్రం 29 రోజులు పూర్తయ్యేసరికి రూ.40.50 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓవరాల్ గా బయ్యర్స్ కు ఈ మూవీ రూ.23.50 కోట్ల లాభాలను అందించింది.

నిన్న 29 వ రోజున హిందీలో కూడా ఈ మూవీని రిలీజ్ చేయగా.. అక్కడ కూడా హిట్ టాక్ ను సంపాదించుకుంది. మొదటి రోజు అక్కడ మంచి వసూళ్లు సాధించింది. అక్కడ ఈ మూవీని ఓన్ రిలీజ్ చేసుకున్నారు కాబట్టి.. వచ్చేదంతా కూడా ప్లస్సే అని చెప్పాలి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus