Sita Ramam Collections: 8వ రోజున కూడా సూపర్ గా కలెక్ట్ చేసిన ‘సీతా రామం’.. !

  • August 13, 2022 / 02:34 PM IST

దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ రాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.స్టార్ హీరోయిన్ రష్మిక మందన,దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్,భూమిక వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇక ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో… మంచి కలెక్షన్లు నమోదు చేసింది.మొదటి వారం ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది.8 వ రోజు కూడా ఈ మూవీ బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 8 రోజుల కలెక్షన్లు గమనిస్తే :

నైజాం 4.55 cr
సీడెడ్ 1.26 cr
ఉత్తరాంధ్ర 1.83 cr
ఈస్ట్ 1.06 cr
వెస్ట్ 0.75 cr
గుంటూరు 0.88 cr
కృష్ణా 0.97 cr
నెల్లూరు 0.45 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.27 cr
ఓవర్సీస్ 4.35 cr
మిగిలిన వెర్షన్లు 3.22 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 20.59 cr

‘సీతా రామం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.16.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.17 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.20.59 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఓవరాల్ గా ఈ మూవీ రూ.3.59 కోట్ల లాభాలను అందించింది.

కానీ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంది. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఈ మూవీ బాగానే కలెక్ట్ చేస్తుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus