కోలీవుడ్ టాప్ హీరో శివ కార్తికేయన్ ఇప్పుడు తెలుగు మార్కెట్ పై దృష్టి పెట్టారు. గతేడాది ఆయన నటించిన ‘డాక్టర్’ సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ అయింది. దీనికంటే ముందు ఆయన నటించిన తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేవారు. వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ‘డాన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు ఈ హీరో. ఇప్పుడు తెలుగు మార్కెట్ పై ఫోకస్ చేశారు శివ కార్తికేయన్.
ఇప్పటికే ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ‘ప్రిన్స్’ అనే సినిమా చేస్తున్నారు. సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇది సెట్స్ పై ఉండగానే శివ కార్తికేయన్ మరో తెలుగు సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. అతడు మరెవరో కాదు.. కళ్యాణ్ కృష్ణ కురసాల. ఈ ఏడాది ‘బంగార్రాజు’ సినిమాతో హిట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ తన తదుపరి సినిమాపై వర్క్ చేస్తున్నారు. గతంలో శివ కార్తికేయన్ కి ఒక లైన్ చెప్పి ఇప్పుడు పూర్తి కథను డెవలప్ చేశారు కళ్యాణ్ కృష్ణ.
ఆ కథ హీరోకి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. నిజానికి ఒకప్పుడు కోలీవుడ్ హీరోలు తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ను అర్ధం చేసుకుంటున్నారు. ముందుగా ధనుష్ లీడ్ తీసుకొని వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ సినిమా ఓకే చేశారు.
ఆ తరువాత శివ కార్తికేయన్ లైన్ లోకి వచ్చారు. మరో హీరో అరుణ్ విజయ్ కూడా ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నారు. అలానే మన హీరోలు కూడా తమ సినిమాలను తమిళంలో రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది బైలింగ్యువల్, పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!