Sivaji: బిగ్ బాస్ షో గురించి శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • January 16, 2024 / 07:18 PM IST

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారు ప్రస్తుతం వెండి తెరపై వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నటుడు శివాజీ సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమం తర్వాత ఈయన సంక్రాంతి పండుగ సందర్భంగా నాగార్జున నటించిన నా సామి రంగ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

స్టార్ మాలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు సీరియల్ ఆర్టిస్టులు అదేవిధంగా నాగార్జున కూడా హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో నాగార్జున శివాజీని ప్రశ్నిస్తూ బిగ్ బాస్ తర్వాత నీ జీవితం ఎలా ఉంది అంటూ అడిగారు. ఈ ప్రశ్నకు శివాజీ సమాధానం చెబుతూ రియల్ వరల్డ్ నుండి మరలా రొటీన్ వరల్డ్ లోకి వచ్చినట్లు ఉంది. అబద్దాలు, ఫోన్లు, గ్రీడీ మొదలయ్యాయి. బిగ్ బాస్ హౌస్లో ఇవేవి ఉండవు.

అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తమ లైఫ్ లో బిగ్ బాస్ కార్యక్రమంలోకి ఒక్కసారైనా వెళ్లి రావాలని తెలిపారు. ఇక నేను ఎక్కడికి వెళ్లినా బిగ్ బాస్ గురించి గొప్పగానే చెబుతాను ఇదొక గొప్ప షో అంటూ సమాధానం చెప్పారు. అంతేకాకుండా తాను బిగ్ బాస్ కార్యక్రమంలో ఇన్ని వారాలపాటు ఫోన్ లేకుండా ఉన్నందుకు నా (Sivaji) కంటి చూపు మెరుగుపడిందని ఈయన తెలిపారు.

హౌస్ లోకి వెళ్లే ముందు నాకు సైట్ ఉండేదని అయితే ఫోన్ చూడకుండా ఇన్ని వారాలపాటు ఉండడంతో తన కంటి చూపు మెరుగుపడిందని ఇక బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చూడటంతో తిరిగి నాకు కంటి చూపు తగ్గింది అంటూ ఈ సందర్భంగా శివాజీ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక శివాజీ ఇలాంటి కామెంట్స్ చేయడంతో నాగార్జున అందుకే నేను సండే ఎవరిని కలవను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది అంటూ తన సీక్రెట్ కూడా నాగార్జున ఈ సందర్భంగా రివీల్ చేశారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus