Naga Chaitanya: అక్కినేని హీరో స్పీడ్ మామూలుగా లేదుగా!

Advertisement

లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో అక్కినేని హీరో నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలు 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించకపోయినా నాగచైతన్యకు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. అయితే ప్రస్తుతం నాగచైతన్య చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. మిడిల్ రేంజ్ హీరోలలో ఈ స్థాయిలో సినిమాలతో బిజీగా ఉన్న హీరో చైతన్య మాత్రమేనని చెప్పవచ్చు. నాగచైతన్య కూడా ఇతర భాషలపై దృష్టి పెట్టి ఆయా భాషల్లో మార్కెట్ ను పెంచుకునే పనిలో పడ్డారు.

Click Here To Watch

విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో చైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. వినయ్ కనకమేడల డైరెక్షన్ లో ఒక సినిమాకు, నందినీ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమాకు చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుసగా విజయాలను సొంతం చేసుకున్న రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో ఒక సినిమాకు చైతన్య ఓకే చెప్పారని బోగట్టా.

పరశురామ్ డైరెక్షన్ లో ఒక సినిమాకు చైతన్య ఓకే చెప్పారు. సర్కారు వారి పాట షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. మానాడు సినిమా రీమేక్ లో నటించడానికి చైతన్య ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కిషోర్ తిరుమల కూడా నాగచైతన్యతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. నాగచైతన్య ప్లానింగ్ అద్భుతంగా ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలతో చైతన్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

తక్కువ గ్యాప్ లోనే సినిమాలను రిలీజ్ చేయాలని చైతన్య భావిస్తున్నారు. ఈ సినిమాలతో చైతన్య మార్కెట్ ను మరింత పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాలతో పాటు చైతన్య కీలక పాత్ర పోషించిన లాల్ సింగ్ చద్దా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus