Skanda: ‘స్కంద’ ప్రమోషన్స్‌కి పాజ్‌… కారణం ఇదేనా? వర్కవుట్‌ అవుతుందా?

  • September 6, 2023 / 11:29 AM IST

సినిమా రిలీజ్‌కు సుమారు నెల రోజుల ముందే ‘ప్రీ రిలీజ్‌ థండర్‌’ అంటూ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ చేసి ప్రచారాన్ని షురూ చేసింది ‘స్కంద’ బృందం. ఇంత కంగారేంటి అని కామెంట్స్‌ వినిపించినా… వాళ్ల లెక్కలు వాళ్లకు ఉన్నాయిలే అనే మాటలు వినిపించాయి. అయితే అంత కంగారుగా ప్రచారం షురూ చేసిన టీమ్‌ ఇప్పుడు ఒక్కసారిగా కామ్‌ అయిపోయింది. దీంతో ఏమైంది ‘స్కంద’ ప్రచారం ఆగిపోయిందేంటి అనే చర్చ మొదలైంది. దీనికిగాను టీమ్‌ను నుండి అనధికారికంగా ఓ సమాచారం బయటకు వచ్చింది. అదే పోస్ట్‌ పోన్‌.

ఇప్పటికే ‘సలార్‌’ సినిమా పోస్ట్‌ పోన్‌ అంటూ వార్తలు వస్తున్న ఈ సమయంలో మరో సినిమా వాయిదా ఏంటి అని అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నది నిజమే.. అయితే ఇప్పుడు ‘స్కంద’ పోస్ట్‌ పోన్‌… ‘సలార్‌’ వల్లనే అని సమాచారం. అంటే ‘సలార్‌’ సినిమా వాయిదా వేస్తుండటంతో ఆ డేట్‌లోకి వెళ్లాలి అని ‘స్కంద’ అనుకుంటున్నాడట. ఈ మేరకు సినిమాను రెండు వారాలు వాయిదా వేసేలా ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. అయితే దీని వెను పెద్ద లాభమే ఆశిస్తున్నారట.

మామూలుగా అయితే సెప్టెంబరు 28కి ‘సలార్‌’ వస్తోందని… ఆ తర్వాత మరో వారం వరకు పెద్ద సినిమాలు లేకుండా చూసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా రాదు అంటున్నారు కాబట్టి ఆ డేట్‌ను, ఆ తర్వాతి వారాన్ని కవర్‌ చేస్తే మంచి వసూళ్లు సాధించొచ్చు అని ‘స్కంద’ ప్లాన్‌ వేస్తున్నాడట. అందుకే ముందుగా అనుకున్న సెప్టెంబరు 15ను కాదని అటు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అందుకే ప్రచారం కూడా ఆపేశారని చెబుతున్నారు.

అయితే ఆ డేట్‌కి కూడా కొన్ని సినిమాలు ఉన్నా.. అవేవీ ఇబ్బంది పెట్టేవి కావు అని కూడా అంటున్నారు. ‘రూల్స్‌ రంజన్‌’, ‘మ్యాడ్‌, ‘పెదకాపు’ ఈ నెలాఖరును టార్గెట్‌ చేసుకుని వస్తున్నవే. మరి పుకార్లుకు తగ్గట్టు ‘స్కంద’ (Skanda) వాయిదా పడతాడా? లేక అనుకున్న డేట్‌కి వచ్చేస్తాడా అనేది చూడాలి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus