Skanda: ‘స్కంద’ ట్రైలర్ ఎవ్వరూ ఊహించని రికార్డ్ కొట్టిందిగా..!

  • September 7, 2023 / 10:57 PM IST

రామ్ హీరోగా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘స్కంద’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 28 న ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తమన్ సంగీతంలో రూపొందిన పాటలకి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.

ఇది పక్కా మాస్ అండ్ యాక్షన్ మూవీ అని టీజర్, ట్రైలర్ చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ఈ మధ్యనే ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దానికి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందులో యాక్షన్ డోస్ బాగా ఎక్కువైందని.. బోయపాటి శ్రీను యంగ్ హీరోలతో ఓకే రకమైన సినిమాలు చేస్తున్నాడని అంతా విమర్శించారు. ‘దమ్ము’ ‘సరైనోడు’ ‘జయ జానకి నాయక’ ‘వినయ విధేయ రామ’ ఇలా బోయపాటి శ్రీను యంగ్ హీరోలతో చేసిన అన్ని సినిమాల పోలికలు ‘స్కంద’ ట్రైలర్లో కనిపించాయి అంటూ ట్రోలర్స్ ఓ రేంజ్లో ఆడేసుకున్నారు.

కానీ ఆ ట్రోల్స్ వల్ల సినిమా ఓపెనింగ్స్ పై ఎటువంటి ఎఫక్ట్ పడదని.. తాజాగా ప్రూవ్ అయ్యింది. ఎందుకంటే ‘స్కంద’ ట్రైలర్ 50 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో రచ్చ రచ్చ చేసింది.మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో ఇది ఆల్ టైం రికార్డ్. బోయపాటి శ్రీను చిత్రాలకి మాస్ ఆడియన్స్ లో భీభత్సమైన క్రేజ్ ఉంది. కాబట్టి ‘స్కంద’ (Skanda) సినిమాకి భారీ ఓపెనింగ్స్ నమోదవ్వడం ఖాయమని స్పష్టమవుతుంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus