Sobhita,Naga Chaitanya: నాగచైతన్య కొత్త ఫొటో వైరల్‌… బూతద్దం పెట్టి చూస్తున్న నెటిజన్లు!

నాగచైతన్య (Naga Chaitanya) , హీరోయిన్ శోభిత ధూలిపాళ (Sobhita Dhulipala) మధ్య ఏం నడుస్తోంది. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఈ చర్చ నడుస్తూనే ఉంది. ప్రేమలో ఉన్నారని కొందరు, కాదు కాదు స్నేహమని మరికొందరు చర్చలు పెడుతూనే ఉన్నారు. ఇలాంటి చర్చలు ఉత్పన్నం కావడానికి కారణం కూడా వాళ్లిద్దరే అని చెప్పాలి. ఓసారి నాగచైతన్య ఓ చెఫ్‌తో ఫొటో పోజు ఇచ్చినప్పుడు అందులో వెనుక శోభిత కనిపించింది. మరికొన్ని సందర్భాల్లో కూడా ఇద్దరూ కలసి కనిపించారు కూడా. అయితే ఇప్పుడు చర్చకు కారణం లైక్‌ అంటున్నారు.

సమంతతో (Samantha) విడిపోయిన తర్వాత నాగచైతన్య రిలేషన్‌షిప్‌ మీద ఏదో ఒకక పుకారు వస్తూనే ఉంది. అదేదో సినిమాలో కలసి నటించిన కొత్త భామతో కాసేపు ఆయనకు బంధం అతికించే ప్రయత్నం చేశారు. కానీ అది వర్కవుట్‌ కాలేదు. అయితే శోభిత ధూలిపాళ విషయంలో మాత్రం అనుమానాలు పక్కా అని అంటున్నారు. అయితే వాటిని ఎప్పటికప్పుడు ఈ జంట ఖండిండచం గమనార్హం. కానీ ఏదో పుకారు మళ్లీ వస్తుండటం విశేషం.

అయితే పుకార్లు వస్తున్నాయని చైతన్య – శోభిత తమ స్నేహాన్ని వీడలేదు. ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు తమ ఇష్టాన్ని చూపించుకుంటూనే ఉన్నారు. తాజాగా నాగచైతన్య సోషల్‌ మీడియా ఖాతాలో ఓ ఫొటో పెడితే… దానికి ఆమె లైక్‌ చేసింది. అందులో ఏముంది ఫొటో బాగుందేమో లైక్‌ చేసింది అని అంటారా? అదేమీ స్పెషల్ ఫొటో ఏమీ కాదు. ఒక సాధారణమైన ఫొటో. ఏదో ర్యాండమ్‌ క్లిక్‌. దీంతో ఈ ఫొటోకి లైక్‌ ఎందుకు అనే చర్చ మొదలైంది.

సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆ ఫొటోను ఇలా పోస్ట్ చేయగానే అలా లైక్ చేసేసింది శోభిత. దీంతో చైతూ పక్కన శోభిత ఉండి ఉండొచ్చు అంటూ కొంతమంది నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలానే పక్కన ఉన్న ఫొటోను గుర్తు చేసుకుంటున్నారు. మరి ఉందా? పోస్ట్‌ చేయగానే చూసిందో తెలియాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus