Thiruveer Wedding Photos: ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

థియేటర్ ఆర్టిస్ట్ అయిన తిరువీర్ (Thiruveer) కెరీర్ ప్రారంభంలో రేడియో జాకీగా పనిచేశారు. 2016లో ‘బొమ్మలరామారం’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అతను ఆ తర్వాత రానా హీరోగా తెరకెక్కిన ‘ఘాజీ’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.అటు తర్వాత ‘ఏ మంత్రం వేశావే’, ‘శుభలేఖలు’ ‘జార్జి రెడ్డి’ వంటి సినిమాల్లో నటించారు. అలాగే ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన ‘మల్లేశం’, అలాగే ‘పలాస 1978 ‘, ‘సిన్'(వెబ్ సిరీస్) వంటి వాటిలో కూడా నటించాడు. అయితే నాని హీరోగా తెరకెక్కిన ‘టక్ జగదీష్’ ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత హీరోగా చేసిన ‘మసూద’ బ్లాక్ బస్టర్ కాగా, ‘పరేషాన్’ మూవీ పర్వాలేదు అనిపించింది అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్న తిరువీర్ సడన్ గా పెళ్లి చేసుకుని పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. తిరువీర్ ఈరోజు అనగా ఏప్రిల్ 21 న కల్పన రావు అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. చాలా కాలంగా ఆమెతో ప్రేమలో ఉన్నాడట ఈ యంగ్ హీరో.

మొత్తానికి ఆమెను పెళ్ళాడి ఓ ఇంటి వాడు అయ్యాడు. ఇరు కుటుంబాల సభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ‘కొత్త ఆరంభం’ అంటూ లవ్ సింబల్‍లను క్యాప్షన్‍గా పెట్టి.. తన హల్దీ వేడుకకి సంబంధించిన ఫోటోలను అలాగే పెళ్లి ఫోటోలను షేర్ చేశాడు తిరువీర్. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus