మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?

  • April 21, 2024 / 08:30 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) భార్య నమ్రత (Namrata Shirodkar)పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ పిల్లలు కెరీర్ పరంగా ఎదగడం కోసం కష్టపడుతున్న సంగతి తెలిసిందే. మహేష్ నమ్రత టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిపుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు. తాజాగా నమ్రత అత్తయ్య ఇందిరా దేవిని తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ అవుతోంది. నమ్రత ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఇందిరా దేవి పాత ఫోటోను పంచుకోవడంతో పాటు మీరు ఎల్లప్పుడూ మాతోనే ఉన్నారని కామెంట్లు చేశారు.

ఏప్రిల్ 20వ తేదీ ఇందిరా దేవి పుట్టినరోజు కావడంతో నమ్రత ఈ పోస్ట్ పెట్టారని తెలుస్తోంది. ఇందిరా దేవికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా ఒకే ఏడాదిలో కృష్ణ (Krishna) , ఇందిరా దేవి మృతి చెంది ఘట్టమనేని అభిమానులకు బాధను మిగిల్చారు. మహేష్ బాబు సినీ కెరీర్ విషయానికి వస్తే గుంటూరు కారం మూవీ యావరేజ్ గా నిలిచినా మహేష్, త్రివిక్రమ్ (Trivikram) క్రేజ్ వల్ల ఈ సినిమాకు కలెక్షన్లు భారీగానే వచ్చాయి.

టికెట్ రేట్ల పెంపు వల్ల ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వచ్చాయని చెప్పవచ్చు. గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాతో పోల్చి చూస్తే హనుమాన్ సినిమాకు బెటర్ టాక్ రావడం ఈ సినిమాకు మైనస్ అయింది. గుంటూరు కారం, హనుమాన్ (Hanu Man) వేర్వేరు సీజన్లలో రిలీజై ఉంటే గుంటూరు కారం కచ్చితంగా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యేదని కామెంట్లు వినిపించాయి.

సమ్మర్ తర్వాత మహేష్ రాజమౌళి (S. S. Rajamouli) కాంబో సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టిన రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్ లుక్ కొత్తగా ఉందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus