బిగ్‌బాస్4: ఆరియానా అన్నట్లు సోహైల్‌కి అంత పొగరా!

  • October 12, 2020 / 08:53 PM IST

సోహైల్‌కు కోపమెక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. చిన్న విషయానికే గొంతు దగ్గర నరాలు పొంగుతాయని ఇంట్లో అందరూ అంటుంటారు. శనివారం నాగార్జున కూడా అదే మాట అన్నారు. ఇంకోసారి ఇంట్లో అమ్మాయిల మీద అరిస్తే కొరడా తీస్తా అంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చారు. అందుకో మరి ఎందుకో కానీ సోహైల్‌ను ఇంటి సభ్యులు రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోంది. గిన్నెలు కడగలేదంటూ అమ్మ రాజశేఖర్‌, మాట వినడం లేదంటూ ఆరియానా, మాటలు బాగోలేవంటూ కుమార్‌సాయి ఈ రోజు సోహైల్‌ను టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తోంది.

నువ్వు గిన్నెల కడిగినప్పటి నుంచే ఈ సమస్య వస్తోందంటూ సోహైల్‌ను తీసుకెళ్లి మాస్టర్‌ ఏదో మరకలు చూపించినట్లున్నాడు. దానికి సోహైల్‌ రియాక్షన్‌ కూల్‌గా కనిపించినా తర్వాత మాస్టర్‌ మీద అసహనం ప్రదర్శించాడు. ఆ తర్వాత ఆరియానా ఏదో మాట్లాడదాం అని వస్తే సోహైల్‌ వినిపించుకోలేదు. దీంతో ఆరియానా విసురుగా వెళ్లిపోతూ ‘పెద్ద పొగరు ఎక్కణ్నో’ అంది. దాంతో సోహైల్‌ ‘ఏంది’ అంటూ రైజ్‌ అయ్యి… కంట్రోల్‌ చేసుకున్నాడు.

ఆ తర్వాత కుమార్‌ సాయి వేలు చూపిస్తూ సోహైల్‌తో మాట్లాడాడు. దాంతో సోహైల్‌కు కోపమొచ్చి వేలు దించమన్నాడు. దానికి కుమార్‌ రిటర్న్‌ జోక్‌గా మాట్లాడాడు. ఇదంతా చూస్తుంటే సోహైల్‌ను కావాలనే ఇరిటేట్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. లేకపోతే ఆరియానా చెప్పినట్లు సోహైల్‌కు పొగరా. ఇదంతా చూస్తుంటే అసలు సోహైల్‌ కెప్టెన్సీకి అర్హుడా కాదా అనే చర్చ కూడా మొదలైంది. చూద్దాం ఈ రోజు రాత్రి ఏమవుతుందో?


చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus