మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా,నభా నటేష్ హీరోయిన్ గా నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకునేలా లేకపోయినా..ప్రేక్షకులు చాలా రోజుల నుండీ థియేటర్లకు మొహమాసిపోయి ఉండడంతో.. వారి ఎమోషన్ ను క్యాష్ చేసుకుని సూపర్ హిట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ‘సోలో బ్రతుకు’ ని జనవరి 1నుండీ ఓటిటి లో పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేశారు. అయినప్పటికీ జనవరి 1న భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టడం ఓ విశేషంగా చెప్పుకోవచ్చు.దీంతో డిసెంబర్ లో కూడా టాలీవుడ్ కు ఓ సూపర్ హిట్ పడినట్టయ్యింది.దాంతో 2020కి మంచి గుడ్ బై చెప్పిందనే చెప్పాలి.
ఇక ఈ చిత్రం 8 కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే :
నైజాం | 3.51 cr |
సీడెడ్ | 1.80 cr |
ఉత్తరాంధ్ర | 1.39 cr |
ఈస్ట్ | 0.83 cr |
వెస్ట్ | 0.52 cr |
కృష్ణా | 0.57 cr |
గుంటూరు | 0.83 cr |
నెల్లూరు | 0.47 cr |
ఏపీ+తెలంగాణ | 9.92 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.51 cr |
ఓవర్సీస్ | 0.37 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 10.80 cr |
‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రానికి రూ.9.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.10.80 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో ఇప్పటివరకూ ఈ చిత్రం 1.2కోట్ల లాభాలను అందించిందని చెప్పొచ్చు. గతేడాది ‘ప్రతీరోజూ పండగే’ చిత్రంతో కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన తేజు ఈసారి ‘సోలో బ్రతుకే సో బెటర్’ తో గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Click Here To Read Movie Review
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!