‘చావు కబురు చల్లగా’ వీటిని తీసుకుందాం లైట్‌గా

‘చావు కబురు చల్లగా’ ట్రైలర్‌ చూశారా.. సూపర్‌ ఉంది కదూ! ఏమన్నా కామెడీ చేశారా, ఆ మాస్‌ డైలాగ్‌లు, లావణ్య క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్లు వామ్మో తెగ నవ్వించేశారు. ఇదంతా సినిమా అభిమానులు అంటోన్న మాటలు. అయితే సినిమాల్లో, ట్రైలర్‌, టీజర్లలో చిన్న చిన్న పాయింట్లు చూసి వివాదాలు రాజేసే కొంతమంది ఇప్పటికే సినిమా మీద కారాలు, మిరియాలు నూరుతున్నారట. కొంతమంది ఇప్పటికే సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సినిమా అంతా ఫన్నీగా ఉన్నా…

కొన్ని డైలాగ్స్‌ , సీన్స్‌ కాస్త టెంపోకి దూరంగా ఉన్నాయనే చెప్పాలి. చావు ఇంటికి వెళ్లి.. ప్రేమించడం, పెళ్లి అయి భర్త చనిపోయిన అమ్మాయిని.. మళ్లీ ప్రేమించమని వెంటపడటం లాంటివి కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. అయితే వీటికి ట్రైలర్‌లోనే చిత్రబృందం కాస్త క్లారిటీ ఇచ్చే పని చేసింది. కానీ… క్లైమాక్స్‌లో హీరోయిన్‌ను చిరాకు పెట్టించే డైలాగ్‌కి ఆన్సర్‌ సినిమాలోనే దొరుకుతుంది. కథానాయిక వెంటపడే హీరో పాత్రలు చాలానే చూశాం. అన్ని సమయాల్లో హీరో అవారాగా కనిపిస్తాడు లేదంటే…

ఫుల్‌ మాస్ ఉంటాడు. ఇక్కడ కూడా అదే చూపించాడు. అసలు హీరో ఎందుకలా ప్రవర్తిస్తాడు అనేది తెలుసుకోకుండా… సినిమా ‘మనోభావాలు దెబ్బతీసేలా ఉంది’ అని అనొద్దు అని సినిమా అభిమానులు కోరుతున్నారు. అయినా ప్రేమించమని అబ్బాయి వెంటపడుతుంటే… చిరాకుపడుతూ అలరించే అమ్మాయిగా లావణ్య త్రిపాఠి నటనకు కొట్టి పారేయలేం కదా.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus