Sreeleela: శ్రీలీల జాతకాన్ని మార్చే సినిమాలు ఇవే.. కొత్త సినిమాలు కష్టమేనా?

  • October 5, 2023 / 06:45 PM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీలకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిమాండ్ కు అనుగుణంగా శ్రీలీల సైతం భారీ రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. అయితే స్కంద సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం శ్రీలీల కెరీర్ కు ఇబ్బందిగా మారింది. ఈ సినిమాలో శ్రీలీల పోషించిన పాత్ర విషయంలో సైతం నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్టినరీ మ్యాన్ సినిమాల్లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నా ఈ సినిమాలపై పెద్దగా అంచనాలు లేవు.

భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలు శ్రీలీల మార్కెట్ ను డిసైడ్ చేయనున్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల గ్యాప్ లో ఈ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. శ్రీలీల మరో కృతిశెట్టి కాకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్న కృతిశెట్టి ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక కెరీర్ విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

శ్రీలీలకు అలాంటి పరిస్థితి రాకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శ్రీలీల ఇతర భాషలపై కూడా దృష్టి పెడితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగుకు మాత్రమే పరిమితమైతే శ్రీలీల కెరీర్ పరంగా నష్టపోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో శ్రీలీల మార్కెట్ మరింత పెరగాలని అభిమానులు ఫీలవుతున్నారు. శ్రీలీల త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించనున్నారు.

శ్రీలీల (Sreeleela) కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో నిజం లేదని సమాచారం అందుతోంది. శ్రీలీల కెరీర్ పరంగా తప్పటడుగులు వేస్తే మాత్రం ఆమె కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం అయితే ఉంటుంది. శ్రీలీల డిమాండ్ చేస్తే భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి సైతం నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే సక్సెస్ రేట్ తగ్గకుండా శ్రీలీల అడుగులు పడితే బాగుంటుందని చెప్పవచ్చు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus