Sreeleela: ఒక్క మూవీ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా శ్రీలీల కెరీర్ కు కష్టమేనా?

  • September 27, 2023 / 12:03 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. శ్రీలీల రెస్ట్ లేకుండా పని చేస్తుండగా ఆమె నటించిన సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లోనే థియేటర్లలో విడుదలవుతున్నాయి. మరికొన్ని గంటల్లో స్కంద మూవీ థియేటర్లలో విడుదల కానుంది. వచ్చే నెలలో భగవంత్ కేసరి సినిమా విడుదల కానుండగా ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటించారు. నవంబర్ నెలలో శ్రీలీల నటించిన ఆదికేశవ సినిమా రిలీజ్ కానుంది.

డిసెంబర్ నెలలో శ్రీలీల నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, జనవరిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈ సినిమాలలో ఒక్క సినిమా ఫ్లాపైనా శ్రీలీలకు ఇబ్బందేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలు ఫ్లాపైతే శ్రీలీల కెరీర్ కు రిస్క్ అని నెటిజన్లు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శ్రీలీల కథల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ఏ మాత్రం తప్పు చేసినా ఆమె కెరీర్ ప్రమాదంలో పడుతుందని చెప్పవచ్చు.

శ్రీలీల (Sreeleela) కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. శ్రీలీల ఇతర భాషలపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే శ్రీలీల పరిమితమయ్యారు. శ్రీలీల నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ శ్రీలీల కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్లు ఒక సినిమా ఫ్లాప్ కావడం వల్ల కొత్త ఆఫర్లను సొంతం చేసుకునే విషయంలో ఫెయిలవుతున్నారు. శ్రీలీల టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్ హీరోలందరితో కలిసి నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్కంద సినిమా శ్రీలీల క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుతుందేమో చూడాల్సి ఉంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus