Sreeleela: బాలయ్యతో మళ్లీ సినిమాలు చేయాలని ఉంది.. శ్రీలీల ఏమన్నారంటే?

  • September 4, 2023 / 06:04 PM IST

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ శ్రీలీల కాంబినేషన్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లొ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గణేష్ యాంతం సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ కు ఇప్పటివరకు 10 మిలియన వ్యూస్ వచ్చాయి. అయితే శ్రీలీల తాజాగా ఒక సందర్భంలో బాలయ్య గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలయ్య సార్ బయట వేరు అని కెమెరా ముందుకు వస్తే వేరు అని శ్రీలీల కామెంట్లు చేశారు.

ఒకసారి బాలయ్య పాత్రలోకి ఎంటర్ అయితే ఆయన భగవంత్ కేసరి మాత్రమేనని (Sreeleela) శ్రీలీల కామెంట్లు చేశారు. ఒకసారి షూట్ మొదలైన తర్వాత బాలయ్య కనిపించరని ఆయన పోషిస్తున్న పాత్ర మాత్రమే కనిపిస్తుందని శ్రీలీల పేర్కొన్నారు. భగవంత్ కేసరి సినిమాలో మా రోల్స్ గురించి రివీల్ చేయడం ఇష్టం లేదని శ్రీలీల చెప్పుకొచ్చారు. భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సమయంలో బాలయ్య నాకు సొంత బాబాయ్ లా అనిపించారని శ్రీలీల కామెంట్లు చేస్తున్నారు.

బాలయ్య సార్ కూడా లొకేషన్ లో నన్ను సొంత కూతురిలా చూసుకున్నారని శ్రీలీల కామెంట్లు చేశారు. ఛాన్స్ వస్తే బాలయ్య సార్ తో మళ్లీ పని చేయాలని ఉందని శ్రీలీల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. త్వరలో భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ పూర్తిస్థాయిలో మొదలుకానున్నాయి. భగవంత్ కేసరి సినిమా అటు బాలయ్యకు, శ్రీలీలకు భారీ స్థాయిలో సక్సెస్ ను అందిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

భగవంత్ కేసరి సినిమా బాలయ్య ఖాతాలో తొలి 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన సినిమాగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భగవంత్ కేసరి సాంగ్స్ అద్భుతంగా ఉండనున్నాయని తెలుస్తోంది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus