యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని కెరీర్ లో బిజీ అయింది. కానీ ఈ మధ్యకాలంలో ఆమె తెరపై పెద్దగా కనిపించడం లేదు. ఆమె జోరు బాగా తగ్గింది. గ్లామర్ షోకి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోయినా.. ఈమెకి అవకాశాలైతే రావడం లేదు. దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో చాటింగ్ చేస్తూ వారికి అందుబాటులో ఉంటోంది.
రీసెంట్ గా ఓ చాటింగ్ సెషన్ లో ఆమెకి ప్రేమకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘మీరు ప్రేమలో ఉన్నారా..?’ అని ఓ నెటిజన్ అడగ్గా.. అవునని సమాధానమిచ్చింది. ‘ఎవరైనా ముద్దు పెడతానంటే వద్దన్నారా..?’ అనే మరో ప్రశ్నకు.. ‘అవును వద్దన్నా..’ అంటూ ఘాటుగా బదులిచ్చింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు తన ప్రేమ విషయాన్ని ఓ పోస్ట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది ఈ బ్యూటీ. వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీముఖి సోమవారం నాడు ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టింది.
‘ఫిబ్రవరి 14, 2022. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్లీ మాట్లాడుకుందాం. బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్’ అంటూ చేతిలో ఫ్లవర్ బొకేతో ఓ ఫొటో షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వారు శ్రీముఖి ప్రేమలో పడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం తెగ హర్ట్ అవుతున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం ఇదేదో ప్రమోషన్ కూడా చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే చెబుతా అంటుంది కదా.. మరి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. గతంలో మాత్రం శ్రీముఖి ఒకరిని ఇష్టపడి రిలేషన్ లోకి వెళ్లింది. కానీ తరువాత బ్రేకప్ అయినట్లు కొన్ని సందర్భాల్లో తెలిపింది.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!