Sridevi Soda Center Collections: ప్లాప్ గా మిగిలిన ‘శ్రీదేవి సోడా సెంటర్’..!

  • September 11, 2021 / 02:37 PM IST

సుధీర్ బాబు హీరోగా ఆనంది హీరోయిన్ గా ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ’70.ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగష్ట్ 27న రిలీజ్ అయ్యింది.టీజర్, ట్రైలర్, పాటల తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ.. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఒక్క క్లైమాక్స్ తప్ప.. కథ మొత్తం పరమ రొటీన్ గా ఉందని ప్రేక్షకులు తిప్పి కొట్టారు.బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది.

ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.65 cr
సీడెడ్ 0.85 cr
ఉత్తరాంధ్ర 0.76 cr
ఈస్ట్ 0.47 cr
వెస్ట్ 0.27 cr
గుంటూరు 0.51 cr
కృష్ణా 0.31 cr
నెల్లూరు 0.18 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.00 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.13 Cr
  ఓవర్సీస్ 0.28 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.41 cr

 

‘శ్రీదేవి సోడా సెంటర్’ కు రూ.7.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావడానికి ఈ చిత్రం రూ.8.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.5.41 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.దాంతో బయ్యర్స్ కు రూ.2.8 కోట్ల వరకు నష్టాలు వాటిల్లాయని చెప్పొచ్చు.

Click Here For Review

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus