‘పొట్టేల్’ (Pottel) సినిమా గత వారం అంటే అక్టోబర్ 25న రిలీజ్ అయ్యింది. యువ, అనన్య నాగళ్ళ (Ananya Nagalla) జంటగా నటించిన ఈ సినిమాని సాహిత్ (Sahit Mothkhuri) డైరెక్ట్ చేశాడు. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో 2 రోజుల ముందే అంటే అక్టోబర్ 23 నే ప్రీమియర్స్ వేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఉంది. అది బాగా వర్కౌట్ అయ్యింది. మెసేజ్ కూడా బాగుంది. టోటల్ గా రివ్యూస్ బాగా వచ్చాయి. మంచి రేటింగ్లు ఇచ్చారు అంతా..!
అందుకోసం సినిమా పుషింగ్ కోసం ఓ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. అయితే ఇది శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) వల్ల ఫెయిల్ అయ్యింది అని చెప్పాలి. రివ్యూవర్స్ పై శ్రీకాంత్ అయ్యంగార్ దారుణంగా విరుచుకుపడ్డాడు. అసభ్యకరమైన పదజాలం వాడి రివ్యూ రైటర్స్ ని తక్కువ చేశాడు. దీంతో మీడియా శ్రీకాంత్ పై ఓ రేంజ్లో మండిపడింది.అతను క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. శ్రీకాంత్ కూడా త్వరలో క్షమాపణలు చెబుతాను అంటూ ఈరోజు వ్యంగ్యంగా ఓ వీడియోను వదిలాడు.
సరే అవి పక్కన పెట్టేస్తే.. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది, మంచి రివ్యూలు వచ్చాయి అని టీం అందరికీ థాంక్స్ చెబుతున్నప్పుడు.. ‘రివ్యూవర్స్ నెగిటివ్ గా రాశారు’ అంటూ చిత్ర బృందానికి చెందిన శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడటం వల్ల సినిమాకి బాక్సాఫీస్ వద్ద డామేజ్ జరిగినట్లు స్పష్టమవుతుంది. స్టేజి పైన సినిమా యూనిట్ కి చెందిన వాళ్ళు బరస్ట్ అయ్యారు అంటే..
నిజంగానే సినిమాలో విషయం లేదేమో అని ఆడియన్స్ భావించినట్టు ఉన్నారు. వాస్తవానికి గత వారం ఈ సినిమాకి మాత్రమే మంచి బజ్ ఉంది. అయినా సరే వీకెండ్లో రూ.50 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక వీక్ డేస్ లో గట్టెక్కడం కష్టమే. దీపావళికి కొత్త సినిమాలు ఉన్నాయి కాబట్టి.. ప్రేక్షకులు దీన్ని కేర్ చేయరు. మంచి ఓటీటీ డీల్ వస్తే నిర్మాతలు కొంతవరకు సేఫ్ అవుతారు అనుకోవాలి అంతే..!