Pelli Choopulu: 10 ఏళ్ళ తర్వాత మరోసారి ‘పెళ్ళిచూపులు’ కాంబో?

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఓ హిట్టు కోసం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాడు. ‘టాక్సీ వాలా’ (Taxi Wala) తర్వాత విజయ్ దేవరకొండకి హిట్టు లేదు. ఎంతో కష్టపడి చేసిన ‘ఫైటర్’ (Liger) ‘ది ఫ్యామిలీ స్టార్’ (The Family Star) వంటివి పెద్ద డిజాస్టర్స్ అయ్యాయి. ‘ఖుషి’ (Kushi) కి పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. అయితే ఇన్ని ఫ్లాపులు వచ్చినా.. అతని స్టార్ డం ఏమీ తగ్గలేదు. అతని ప్రతి సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి.

Pelli Choopulu

‘ఖుషి’ చిత్రం రూ.85 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. సో సరైన సినిమా పడితే విజయ్ దేవరకొండకి వంద కోట్లు కొట్టడం అనేది కేక్ వాక్ అనే చెప్పాలి. మార్కెట్ పరంగా విజయ్ స్ట్రాంగ్ గానే ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. ‘జెర్సీ’ (Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ కెరీర్లో 12 వ సినిమాగా రూపొందుతుంది ఈ సినిమా.

సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. రెండు పార్టులుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే రెనో పార్టు కి కొంచెం టైం పట్టొచ్చు. ఆ గ్యాప్లో ‘టాక్సీ వాలా’ దర్శకుడితో విజయ్ ఇంకో సినిమా చేసే ఛాన్స్ ఉంది. పారలల్ గా ఇంకో సినిమా చేసే అవకాశం కూడా ఉంది అనేది తాజా సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం..

తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘పెళ్ళి చూపులు’ (Pelli Choopulu) సూపర్ హిట్ అయ్యింది. అయితే తర్వాత ఎందుకో వాళ్ళు కలిసి వెంటనే సినిమా చేయలేదు. మొత్తానికి వాళ్ళ కాంబోలో ఇంకో సినిమా రాబోతుంది. ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ అని సమాచారం. 2025 లో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుందని సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus