బ్యాగ్రౌండ్ స్కోర్ తో గట్టి పోటీనిస్తున్న తమన్ బాబు

  • October 25, 2018 / 01:19 PM IST

సంగీత దర్శకుడిగా తనపై ఉన్న కాపీ ట్యూన్ల బాబు అనే అపవాదును బ్యాగ్రౌండ్ స్కోర్స్ తో పోగొట్టుకొనే పనిలో పడ్డాడు తమన్. గతేడాది చిరంజీవి “సైరా నరసింహా రెడ్డి” టీజర్ కి తమన్ సంగీతం అందించాడు. ఇక రీసెంట్ గా వచ్చిన “సాహో” మేకింగ్ వీడియో టీజర్ కి కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ రెండు వీడియోలు ఫ్యాన్స్ కి విశేషంగా నచ్చడంలో కీలకపాత్ర పోషించింది తమన్ మ్యూజిక్. “అరవింద సమేత” సినిమాకి కూడా తమన్ కి చాలా మంచి పేర్కొచ్చింది. దేవిశ్రీప్రసాద్ కి ఈమధ్యకాలంలో సరైన హిట్ లేకపోవడం.. మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ సినిమాలకు కాస్త దూరంగా ఉంటుండడం.. కొత్త సంగీత దర్శకులు సరికొత్త బాణీలతో అలరిస్తున్నప్పటికీ.. వారి పాటలు రీచ్ అవుతున్నప్పటికీ.. సినిమాలు సరిగా ఆడకపోవడంతో వాళ్లెవరికీ సరైన పేరు రావడం లేదు.

ఈ స్పేస్ ను తమన్ సరిగ్గా వాడుకొంటున్నాడు. సినిమాలకు మాత్రమే కాకుండా క్రేజీ ప్రొజెక్ట్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తూ.. మోస్ట్ వాంటెడ్ మరియు బిజీయస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు తమన్. ఇదే స్పీడుతో ఇంకో ఏడాది పరిగెట్తాడంటే.. అతిత్వరలోనే అగ్ర సంగీత దర్శకుడు అనిపించుకోవడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus