‘అదే ‘మీటూ’ అయితే దాన్ని కంటిన్యూ చేస్తా..’

ప్రముఖ మలయాళ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ వినాయకన్ మీటూ ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తను పది మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానంటూ అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వినాయకన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ఒరుతె’ ప్రమోషన్స్ లో భాగంగా మీటూకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై అతడు స్పందించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాదు మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు సైతం వినాయకన్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Click Here To Watch NOW

ఇంతకీ ఆయనేం మాట్లాడారంటే..? ‘మీటూ’ ఉద్యమం అంటే ఏంటో తనకు తెలియదని.. ఒక మహిళను నాతో సెక్స్ చేస్తావా..? అని అడగడం మీటూ అయితే.. దాన్ని కంటిన్యూ చేస్తా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా.. ఇది మహిళలకు సంబంధించిన విషయమా..? తాను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తన జీవితంలో ఇప్పటివరకు పది మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానని..

వారందరిని ‘నాతో పడుకుంటావా..?’ అని అడిగానని చెప్పుకొచ్చారు. ఇదే మీటూ అయితే ఇకపై కూడా తాను అలాగే చేస్తానంటూ స్పష్టం చేశారు. అతడి తీరుపై నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా మండిపడుతున్నారు. మీటూపై సరైన అవగాహన లేకుండా ఉన్నాడంటూ వినాయకన్ పై విరుచుకుపడుతున్నారు. నిజానికి వినాయకన్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇది మొదటిసారి కాదు. 2019లో ఓ దళిత మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్ట్ అయి అతడు జైలుకి వెళ్లాడు.

ఇప్పుడు మరోసారి మీటూపై సంచలన కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్నాడు. బాలీవుడ్ లో మొదలైన ఈ మీటూ ఉద్యమం సౌత్ ఇండస్ట్రీలను కూడా షేక్ చేసింది. ఇలాంటి ఉద్యమంపై వినాయకన్ వెటకారంగా మాట్లాడడంతో నెటిజన్లు, సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus