సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారే కాకుండా.. మిగతా భాషలకు చెందిన సినీ నటులు కూడా మరణిస్తుండడం గమనార్హం. ఈరోజు ప్రముఖ బాలీవుడ్ రచయిత అలాగే సీనియర్ నటి అయిన లలిత లాజ్మీ మరణించడం జరిగింది. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు కన్నుమూసింది. హీరో గురుదత్ కు ఈమె సోదరి కావడంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ షాక్ నుండి ఇంకా బాలీవుడ్ కోలుకోకుండానే ఇప్పుడు మరో నటుడు మరణించడం అందరికీ పెద్ద షాకిచ్చింది.వివరాల్లోకి వెళితే…ప్రముఖ బాలీవుడ్ నటుడు జావేద్ ఖాన్ అమ్రోహి అనారోగ్య సమస్యలతో మరణించారు. జావేద్ ఖాన్ కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.దీంతో కొన్నాళ్లుగా ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈరోజు కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఈయన మరణానికి చింతిస్తూ బాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు తమ ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.
అలాగే జావేద్ ఖాన్ తో మంచి సన్నిహితం ఉన్న వారు అతని మరణం బాలీవుడ్ కు తీరని లోటు అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు. జావేద్ ఖాన్ బాలీవుడ్లో 150కి పైగా చిత్రాల్లో నటించారు. ‘లగాన్’, ‘వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ఇండియా’, ‘చక్ దే ఇండియా’, ‘సడక్ 2’, ‘అందాజ్ అప్పా అప్పా’, ‘ఇష్క్’ వంటి చిత్రాల్లో నటించారు. ఆయన సినీ కెరీర్లో ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!