Dookudu: 12 ఏళ్ళ బ్లాక్ బస్టర్ ‘దూకుడు’ గురించి ఎవ్వరికీ తెలియని ఇంట్రెస్టింగ్ న్యూస్..!

  • September 23, 2023 / 10:28 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దూకుడు’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. 2011 వ సంవత్సరంలో సెప్టెంబర్ 23 న రిలీజ్ అయిన ఈ సినిమా .. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకి ముందు మహేష్ ప్లాపుల్లో ఉన్నారు.

‘పోకిరి’ తర్వాత మహేష్ చేసిన ‘సైనికుడు’ ‘అతిథి’ ‘ఖలేజా’ వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి. మహేష్ ను మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా ఇదే. ఈ సినిమాలో ముఖ్యంగా తండ్రి పాత్ర చాలా కీలకం. ఎందుకంటే కథ మొత్తం.. ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఈ పాత్ర కోసం దర్శకుడు శ్రీను వైట్ల చాలా మంది స్టార్స్ ను అప్రోచ్ అయ్యాడు. మొదట (Dookudu) ‘దూకుడు’ లో హీరో తండ్రి పాత్ర కోసం శ్రీహరి ని అడిగాడట.

కానీ ఆ టైంకి ఫాదర్ రోల్ చేయడం ఇష్టం లేక ఆయన నొ చెప్పారట. అయినా సరే ఈ ప్రాజెక్టుని వదులుకోలేక బ్రదర్ రోల్ గా మార్చు చేస్తాను అని అన్నాడట. కానీ తండ్రి కాకుండా అన్నగా మారిస్తే ఎమోషనల్ గా ప్రేక్షకులు కనెక్ట్ అవ్వరు అని భావించి శ్రీను వైట్ల కూడా వెనక్కి తగ్గారట. ఆ తర్వాత మహేష్ సూచన మేరకు ప్రకాష్ రాజ్ ను తీసుకున్నాడట శ్రీను వైట్ల.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus