సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత.. నెటిజన్లు నేరుగా సెలెబ్రిటీలతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలుగుతుంది. అయితే దానిని కొందరు పద్దతిగా వాడుతూ .. సెలబ్రిటీలను పలకరిస్తుంటే.. మరికొందరు మాత్రం వారి పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వారిని విసిగిస్తుంటారు. అయినప్పటికీ కొందరు త్వరగా రియాక్ట్ అవ్వరు. అయితే మరికొంతమంది నటీమణులు మాత్రం ఆగ్రహం చూపిస్తుంటారు. అనసూయ, రష్మీ వంటి వారు అనేక సార్లు అభిమానుల పై ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా కొంచెం ఘాటుగానే రిప్లై ఇచ్చారు.
ఆ హీరోయిన్లు మరెవరో కాదు.. పూనమ్ కౌర్, వరలక్ష్మీ శరత్ కుమార్ లు. ఇటీవల వరలక్ష్మి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దానికి ఓ నెటిజెన్.. ‘ఈ బర్త్ డే తో 35 ఏళ్లు నిండాయా ఆంటీ’ అంటూ ట్రోల్ చేసే ప్రయత్నం చేసాడు. దానికి వరలక్ష్మీ ‘అవును.. అయితే ఏంటి అంకుల్’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన… పూనమ్ కౌర్ ను సైతం కొందరు నెటిజన్లు ఇలా కౌంటర్ లు వేసే ప్రయత్నం చేశారు. ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటోను ‘వావ్ అదిరిపోయింది ఆంటీ’ అంటూ ఓ తుంటరి కామెంట్ చేసాడు. దానికి పూనమ్… ‘థ్యాంక్యూ అంకుల్’ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఏదో తెలిసిన వాళ్ళని సరదాగా ఆట పట్టిస్తే పర్వాలేదు కానీ.. ఇలా సెలబ్రిటీలను కామెంట్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Most Recommended Video
పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!