Allu Arjun: ఆ ఫైర్ బ్రాండ్ మన బన్నీని తగులుకుందేంటి…!

అల్లు అర్జున్.. తన కంటే వయసులో పెద్దదైన ఓ హీరోయిన్ కు లైన్ వేసాడట. స్వయంగా ఆ హీరోయినే ఈ విషయాన్ని బయట పెట్టింది హాట్ టాపిక్ అయ్యింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు… వనిత విజయ్ కుమార్.గతేడాది కరోనా లాక్ డౌన్ టైంలో ఈమె మూడో పెళ్లి చేసుకుని సంచలనం రేపిన సంగతి అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. పీటర్ పాల్ అనే వ్యక్తిని ఈమె మూడో పెళ్లి చేసుకోవడం.. అతనికి కూడా ఇది రెండో పెళ్లి కావడంతో ఆ విషయం దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది.!

అలా అని వీళ్ళు ఎక్కువ కాలం కలిసి లేరు. కొన్నాళ్ళకే వీళ్ళ మధ్య మనస్పర్థలు రావడంతో ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈమె ఖాళీగా ఉండటంతో ఓ యూట్యూబ్ ఛానల్ లో వంటల ప్రోగ్రాం చేస్తుంది.కాగా ఇటీవల ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మన అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. వనిత మాట్లాడుతూ.. “గతంలో తెలుగు సినీ పరిశ్రమ చెన్నై లో ఉండేది. ఆ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మధ్య మంచి అనుబంధం ఉండేది. చిరంజీవి గారి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మా ఫ్యామిలీ మొత్తం వెళ్లేవాళ్లం.

ఓసారి ఆయన కొత్త సినిమా ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. అప్పుడు అతను చాలా స్టైలిష్ గా కనిపించాడు. అయితే కొద్దిసేపటి తర్వాత అతను నాకు లైన్ వేయడం మొదలుపెట్టాడు.ఆ టైములో అతనికి 14 ఏళ్ళ వయసుంటుంది.అతనికంటే నా వయసు పెద్దది. చిన్నవాడైనా సరే.. నాకు లైన్ వేసాడు. ఇప్పుడతను ఇంత స్టార్ అవుతాడని నేను ఊహించలేదు. ” అంటూ కామెంట్స్ చేసింది వనిత విజయ్ కుమార్.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus