ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

  • May 20, 2021 / 09:51 PM IST

సినిమాలో హీరో చనిపోయినా.. లేదా అప్పటివరకూ మంచిగా ఉన్న ఓ పాత్ర చనిపోయినా మనం చాలా బాధపడతాము. ‘అరెరే.. ఈ పాత్ర బ్రతికి ఉంటే బాగుండేదే’ అంటూ కాసేపు ఆ సినిమా తీసిన దర్శకుడిని తిట్టుకుంటూ థియేటర్ నుండీ వచ్చేస్తాం.చివరికి సినిమా అనేది పూర్తిగా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది అని సర్ది చెప్పుకుంటాం..! అయితే నిజ జీవితంలో మనల్ని అలరించే నటీనటులు చనిపోతే ఎవరిని అని తిట్టుకుంటాం? జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో.. ఎవరు ఏ స్థాయిలో ఉంటారో.. ఎవ్వరూ ఊహించలేరు కదా. సరిగ్గా ఇలాగే కొంతమంది సినీ సెలబ్రిటీలు వాళ్ళ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగా చనిపోయారు. మంచి పొజిషన్ లో ఉండగా చనిపోయారు కాబట్టి.. వీళ్ళ మరణవార్త తెలిసిన తరువాత ప్రేక్షకులు చాలా రోజులు ఆ బాధ నుండీ బయటకు రాలేకపోయారు. మరి హఠాత్తుగా చనిపోయిన ఆ సెలబ్రిటీలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) సుత్తి వీరభద్ర రావు:

కామెడీ కి సరికొత్త డెఫినిషన్ చెప్పిన గొప్ప నటుడు.బోలెడన్ని అవకాశాలు ఉన్నప్పటికీ 45 ఏళ్ళకే అనారోగ్యంతో మరణించాడు.

2) ఫటాఫట్ జయలక్ష్మి:

తెలుగు, తమిళ సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న టైం లో ఈమె మరణించింది.అప్పటికి ఈమె వయసు కేవలం 22 ఏళ్ళు మాత్రమే కావడం విషాదకరం.

3) సౌందర్య:

మరో సావిత్రిలా చక్రం తిప్పుతుంది అనుకున్నారు.చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి. కానీ 34 ఏళ్ళకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.

4) ప్రత్యూష:

వరుసగా మంచి అవకాశాలు అందుకుంటున్న టైములో ఈమె మరణించింది. కొంతమంది ఈమె పై అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.చనిపోయినప్పుడు ఈమె వయసు కేవలం 22 ఏళ్ళు మాత్రమే..!

5) దివ్య భారతి:

స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంటున్న టైములో ఈమె మరణించింది. 19 ఏళ్ళకే ఈమె మరణించడం విషాదకరం.

6) యశో సాగర్:

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రం హీరో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న టైములో అదీ 25 ఏళ్ళకే మరణించాడు.

7) ఎం.ఎస్.నారాయణ:

ఈయన 63 వయస్సులోనే మరణించాడు. కానీ ఆ టైంకి ఈయన స్టార్ కమెడియన్ గా 20 కి పైగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నాడు.

8) శ్రీహరి:

విలన్ గా, హీరోగా రాణించిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు శ్రీహరి గారు. కానీ 49 ఏళ్ళకే ఈయన మరణించారు.

9) ఇర్ఫాన్ ఖాన్:

ఈయన 54 ఏళ్ళ వరకూ బ్రతికారు. కానీ చేతిలో 20 కి పైగా సినిమా ఆఫర్లు ఉన్న టైములో ఈయన మరణించారు.

10) సుశాంత్ సింగ్:

ఈ స్టార్ హీరో 34 ఏళ్ళకే(గతేడాది) సూసైడ్ చేసుకుని చనిపోయాడు.

11) చిరంజీవి సార్జా:

అర్జున్ మేనల్లుడు.. కన్నడ స్టార్ హీరో అయిన చిరంజీవి 35 ఏళ్ళకే గుండెపోటుతో మరణించాడు.

12) కె.వి.ఆనంద్:

కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే ఈయన మరణించారు.

13) టి.ఎన్.ఆర్:

నటుడిగా, జర్నలిస్ట్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న టైములో ఈయన కరోనాతో మరణించాడు. ఈయన వయసు కేవలం 45 ఏళ్ళు మాత్రమే.

14) తిరుపతి స్వామి:

జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈయన అటు తరువాత దర్శకుడిగా మారి ‘గణేష్’ ‘ఆజాద్’ వంటి సినిమాలు చేశారు. ఈయన 32 ఏళ్ళకే కార్ యాక్సిడెంట్ లో మరణించడం అప్పట్లో ప్రేక్షకులను చాలా బాధ పెట్టింది.

15) శంకర్ నాగ్:

ఈయన కన్నడలో సూపర్ స్టార్ గా ఎదిగారు. కానీ 35 ఏళ్ళకే కార్ యాక్సిడెంట్ లో మరణించడం చాలా బాధాకరం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus