న్యూడ్ సీన్ గురించి క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..!

సినిమా విషయంలో హీరోయిన్లు మాత్రమే కాదు ఒక్కోసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు వంటి వారు కూడా గ్లామర్ షో చేయాల్సి వస్తుంది. సీన్ ఇంకా డిమాండ్ చేస్తే ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి నటీమణులు సాహసించరు. పరిమితులను దాటి నటించాలంటే చాలా ధైర్యం కావాలి. అలా అని గతంలో నటించిన వాళ్ళు లేరా అంటే.. ఉన్నారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఇలాంటి సన్నివేశాల్లో నటించాలి అని అడగడానికి కూడా దర్శక నిర్మాతలు జంకుతున్నారు.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఇటీవల ఓ తమిళ నటి.. తనని నటిని చేసిన దర్శకుడి కోసం సినిమాలో నగ్నంగా నటించి హాట్ టాపిక్ అయ్యింది. ఆమె మరెవరో కాదు బ్రిగిడ సాగా. వివరాల్లోకి వెళితే దర్శకుడు పార్తిబన్ ఇటీవల ‘ఇరవిన్ నిళల్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ , రోబో శంకర్, ప్రియాంకా రుత్, బ్రిగిడ సాగా ఆనంద కృష్ణన్ వంటి వారు నటించారు. జూలై 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ చిత్రంలో బ్రిగిడ సాగా నగ్నంగా నటించింది. ఈ సన్నివేశం పై ఆమె మాట్లాడుతూ.. “అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న నన్ను నటిని చేసింది పార్తిబన్. ఆయన రిక్వెస్ట్ మేరకు నేను ‘ఇరవిన్ నిళల్’ మూవీలో నగ్నంగా నటించాను. ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసేందుకు వెళ్లిన.. నన్ను నటిగా ఎంపిక చేశారు పార్తిబన్.ఈ సినిమాలో ఓ న్యూడ్ సీన్ అవసరమవుతుందని, అందుకు సినిమాను ప్రేమించే వారైతేనే కరెక్ట్ అని ఆయన చెప్పారు.

ఈ పాత్ర చేయడానికి మా తల్లిదండ్రులను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డాను. డెరెక్టర్ కూడా వచ్చి అంతా వివరించడంతో వారు ఒకే అన్నారు. అయితే, ఈ సన్నివేశంలో అనేక టెక్నికల్‌ విషయాలున్నాయి, సినిమాలో చూస్తే మాత్రం అది నిజంగానే న్యూడ్‌ సీన్‌గా కనిపిస్తుంది” అంటూ బ్రిగిడ చెప్పుకొచ్చింది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus